India issues advisory: ఇజ్రాయిల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భారీ యుద్దం జరుగుతోంది. అంతకుముందు ఈరోజు హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి 5000 రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. ఈ నేపధ్యంతో తాము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ లో ఉంటున్న భారత పౌరుల రక్షణ కోసం అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనల్ని జారీ చేసింది.
Israel: పాలస్తీనా గాజా స్ట్రిప్ నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయిల్ భూభాగంపైకి 5000 రాకెట్ల్ ప్రయోగించారు. ఈ దాడుల్లో 50 మంది దాకా మరణించగా.. 30 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ పౌరులపై మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరిపారు. ఇజ్రాయిల్ పట్టణాల్లో స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.
China: ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
Covid-19: సింగపూర్‌లో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ మరో కోవిడ్ వేవ్ ని ఎదుర్కొంటోందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ శుక్రవారం హెచ్చరించారు.
USA: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన కుటుంబంలో విషాదం నిండింది. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సోనాల్ పరిహార్(42)తోపాటు వారి 10,6 ఏళ్ల వయసున్న పిల్లలు ప్లెయిన్స్‌బోరో లోని వారి ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.
Maharashtra: పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియన వ్యక్తుల రైలుని పట్టాలను తప్పించేందుకు కుట్ర పన్నారు. ఈ ఘటన శుక్రవారం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూణే-ముంబై రైల్వే ట్రాకుపై పెద్ద బండరాళ్లను రైల్వే అధికారులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉద్దేశపూర్వకంగా దుండగులు రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారని రైల్వే అధికారులు చెప్పారు.
Peegate Incident: ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికులు తప్పతాగి సహ ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనల్ని మనం చూశాం. అయితే రైలులో కూడా తప్పతాగిన ఓ వ్యక్తి తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు పీకలదాకా తాగి వృద్ధ దంపతులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీ గెలుచుకున్నారు.అయితే ఆమె ప్రస్తుతం టెహ్రాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపుగా 30కి పైగా కేసులను అక్కడి మత ఛాందసవాద ప్రభుత్వం ఆమెపై మోపింది. నర్గీస్ ఒక్కరే కాదు, ఈమెతో కలిపి ఐదుగురు జైలులో ఉన్న సమయంలోనే వారికి నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి.
MG ZS EV: ఇండియన్ కార్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో టాటా లీడింగ్ కంపెనీగా ఉంది. అయితే టాటా తర్వాత ఎంజీ నుంచి వచ్చి ZS EV కార్ ఎక్కువగా అమ్ముడైంది.