World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్-2023 క్రికెట్ సమరం మొదలైంది. ఈ రోజు మొదలైన క్రికెట్ సమరం ప్రేక్షకులకు మంచి మజా ఇచ్చింది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలిపోరులో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ని మట్టికరిపించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒకే వికెట్ కోల్పోయి కివీస్ జట్టు ఛేదించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులోల కివీస్ ఆటగాళ్లు కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి కేవలం 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. డెవాన్ కాన్వే 153 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర కేవలం 93 బంతుల్లో అజేయంగా 123 పరుగులు చేశాడు.
ఇండియా మూలాలు ఉన్న ఈ న్యూజిలాండ్‌కి చెందిన 23 ఏళ్ల కుర్రాడi రచిన్ రవీంద్ర ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మూడోస్థానంలో వచ్చి ఇంగ్లాండ్ పేసర్లను భయపెట్టాడు. ఏ క్షణం కూడా ఇంగ్లాండ్ జట్టుకు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గైర్హాజరుతో రచిన్ రవీంద్ర ఆయన స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేశారు.
Read Also: World Cup 2023: ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్
రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతదేశానికి చెందినవారు. అయితే రవీంద్రకు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ తో సంబంధం ఉంది. ఏంటంటే రవీంద్ర తండ్రి ఈ ఇద్దరు లెజండరీ క్రికెటర్లకు వీరాభిమాని. రాహుల్ ద్రావిడ్ లోని ‘ర’ అనే అక్షరాన్ని, సచిన్ లోని ‘చిన్‘ అనే అక్షరాలతో కొడుకుకు రచిన్ రవీంద్ర అనే పేరున పట్టాడు. రచిన్ పేరులో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్ల పేర్లు కూడా మిళితమై ఉన్నాయి.
రవీంద్ర 2018 అండర్-19 ప్రపంచకప్ లో కూడా పాల్గొన్నాడు. 2021లో బంగ్లాదేశ్ తో జరిగి టీ20లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆరంగ్రేటం చేశారు. 2023లో వన్డే క్రికెట్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు, 12 వన్డేలు, 18 టీ20 మ్యాచుల్లో ఆడాడు. పాకిస్తాన్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో 97 పరుగుల అద్భుతమైన నాక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఇంగ్లాండ్ మ్యాచులో మెరుపులు మెరిపించాడు.