ఇదిలా ఉంటే తాజాగా 52 ఏళ్ల మంత్రగాడు 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భదోహిలో జరిగింది. దుష్టశక్తులను తరిమేస్తానని చెబుతూ.. యువతిపై ఘోరానికి పాల్పడ్డాడు. నిందితుడిని శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
Israel: ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడిన ఒక్కో హమాస్ కీలక నేతల్ని ఇజ్రాయిల్ ఆర్మీ హతం చేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక ఉగ్రవాదులు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడుల్లో హతమయ్యారు. ఇందులో హమాస్ ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా ఫోర్స్’ అల్ కేద్రాను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మిగతా హమాస్ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్ వైమానికి దళానికి చీఫ్ గా ఉన్న మరో ఉగ్రవాది మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.
Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానా ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శనివారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏ దశలోనూ భారత్ జట్టుకు పోటీగా నిలబడలేదు. ఐసీసీ ఈవెంట్లలో మరోసారి భారత్ చేతిలో 8వసారి ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో ఓ అభిమాని ఇజ్రాయిల్ కి మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు.
Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ అభిమానుల అత్యుత్సాహం అతనికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నితీష్ కుమార్‌ని పొగుడుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రపక్షమైన ఆర్జేడీ కూడీ ఈ వివాదాలపై ఆచితూచి స్పందిస్తోంది. తాజాగా ఓ అభిమాని నితీష్ కమార్ ‘‘దేశానికి రెండో గాంధీ’’ అని పొగుడుతూ బ్యానర్‌ని ఏర్పాటు చేశారు.
China: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ప్రజలు ఊచకోత కోశారు. ఈ దారుణ ఘటనలో 1300 మంది ఇజ్రాయిలు చంపబడ్డారు. దీంతో పాటు 150 మందిని హమాస్ మిలిటెంట్లు బందీగా గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడి వల్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. వైమానిక దళం గాజా నగరంతో పాటు ఉత్తర ప్రాంతాన్నిటార్గెట్
Afghanistan Earthquake: తాలిబాన్ పాలనతో పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్ఘానిస్తాన్ వరస భూకంపాలతో అల్లాడుతోంది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా భూకంప తీవ్రత నమోదైంది. గత వారం పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల్లో భూకంపం వచ్చిన చోటే మరోసారి భూకంపం చోటు చేసుకుందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Israel-Hamas War: పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ బలగాలు సిద్ధమవుతున్నాయి. శనివారం పదాతిదళాలను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. రెండో దశకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలనే ఇండియా అభిప్రాయాన్ని ఆయన నొక్కిచెప్పారు. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ బిడ్డింగ్ వెస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) 141వ సెషన్‌ని మోడీ ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ జరుగుతోంది. భారతదేశంలో చివరి ఒలింపిక్ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది. 2029 యూత్ ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని…
IMF: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచం రెండుగా చీలి ఇరు వైపుల పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న వేళ ఇప్పుడు ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్య ప్రపంచం ముందు నిలిచింది.