Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానా ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే ఢిల్లీలో భూప్రకంపలను వచ్చాయి. ఢిల్లీలో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రకంపలను చోటు చేసుకున్నాయి. నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం రావడంతో దాని ప్రభావం ఉత్తర భారతంలో కనిపించింది.