India vs Pakistan: పాకిస్తాన్ హమాస్‌కి మద్దతు తెలుపకుండా ఇండియా గెలిచింది.. క్రికెట్ మ్యాచ్‌పై ఇజ్రాయిల్ రాయబారి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శనివారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏ దశలోనూ భారత్ జట్టుకు పోటీగా నిలబడలేదు. ఐసీసీ ఈవెంట్లలో మరోసారి భారత్ చేతిలో 8వసారి ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో ఓ అభిమాని ఇజ్రాయిల్ కి మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్లను సదరు వ్యక్తి ప్రదర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలోన్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యం నన్ను కదిలించిందని కామెంట్ చేశారు.
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ ‘రెండో గాంధీ’.. బీహార్‌లో కొత్త వివాదం..
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
హమాస్‌కు పాకిస్తాన్ మద్దతు తెలిపకుండా భారత్ విజయం అడ్డుకుందని అందుకు నేను సంతోషిస్తున్నానని గిలోన్ అన్నారు. మ్యాచ్ సమయంలో భారత స్నేహితులు ఇజ్రాయిల్ కి తమ సంఘీభావం ప్రకటించడం మమ్మల్ని కదిలించింది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్దం చేస్తున్న ఇజ్రాయిల్ కి భారత్ మద్దతుగా నిలుస్తోంది అని ఓ అభిమాని పోస్టర్లు పట్టుకున్న ఫోటోలను గిలోన్ పోస్ట్ చేశారు. అంతకుముంద శ్రీలంకతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హమాస్ లోని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ దృశ్యం వైరల్ అయింది.
ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడుతూ, మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. దీనిపై రాయబారి గిలోన్ మాట్లాడుతూ.. చాలా మంది భారతీయులు ఇజ్రాయిల్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, దీంతో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ మరో విభాగాన్ని ఏర్పాటు చేయమని అభివర్ణించారు. ఉగ్రవాద చర్యలను మొదట ఖండించిన ప్రపంచ నేతల్లో ప్రధాని మోడీ ఒకరని ప్రశంసించారు.
हमें खुशी है कि #CWC23 में #INDvPAK मैच में #भारत 🇮🇳 विजयी हुआ और पाकिस्तान अपनी जीत हमास के आतंकवादियों को समर्पित नहीं कर पाया।
हम हमारे भारतीय मित्रों द्वारा मैच के दौरान पोस्टर दिखाकर कर इज़राइल 🇮🇱 के साथ अपनी एकजुटता दिखाने से हम बेहद भाव विभोर हैं। 🙏
We are happy that… pic.twitter.com/fIDY4Ap7aJ
— Naor Gilon🎗️ (@NaorGilon) October 14, 2023
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!