Raghav Chadha: కేజ్రీవాల్‌ని జైలులో వేసి, 7 సీట్లు గెలవండి.. ఆప్ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(ఆప్) అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ లిక్కర్ కేసులో సమన్లు జారీ చేసింది. దీంతో ఆప్ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆప్ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై మండిపడ్డారు. కేజ్రీవాల్‌ని బీజేపీ ఏజెన్సీలు అరెస్ట్ చేయబోతున్నాయని ఆరోపించారు.
ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి, ఇండియా కూటమి ఇక్కడ పోటీ చేస్తే ఢిల్లీలోని ఏడు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని అందరికి తెలుసు. దీంతో అధికార పక్షం భయపడి, ప్రతిపక్షాలను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల్లో మొదటగా అరవింద్ కేజ్రీవాల్ నే టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శించారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
Read Also: Yogi Adityanath: “తాలిబాన్‌లకు బజరంగ్‌బలి” పరిష్కారం.. యోగీ సంచలన వ్యాఖ్యలు..
అరవింద్ కేజ్రీవాల్ ని జైలులో వేసి, 7 సీట్లను జేబులో వేసుకోవాలనేదే బీజేపీ ప్లాన్ అని రాఘవ్ చద్దా అన్నారు. బీజేపీ తదుపరి టార్గెట్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అని అన్నారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయనకు ప్రజాదరణ పెరిగిందని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జార్ఖండ్‌లోని 19 సీట్లలో 14 గెలుచుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో 4 సీట్లను కూడా గెలవదని ఆయన జోస్యం చెప్పారు. అందుకే బీజేపీ ఆయన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని అన్నారు.
వీరే కాకుండా బీహార్ లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇలా బీజేపీ టార్గె్ట్ చేస్తుందని మండిపడ్డారు. ఇండియా కూటమిలోని అగ్రనేతల్ని కటకటాల వెనక్కి నెట్టితే, బీజేపీ మాత్రమే రేసులో ఉంటుందని, గెలుస్తుందని చద్దా అన్నారు. ఇదే బీజేపీ వ్యూహమని ఆయన ఆరోపించారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా సీఎం కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేసింది. ఆయను ప్రశ్నించిన తర్వాత నవంబర్ 2న అరెస్ట్ చేస్తుందని ఆప్ ఆరోస్తోంది. అయితే ఈ కేసులో గతంలో సీబీఐ కేజ్రీవాల్ ని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..