Boat Capsizes: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం.. 18 మంది గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsizes: బీహార్ రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చప్రాలో సరయూ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు వెలికితీశారు. మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే రాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రజలు సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైన సమయంలో నదిలో పడవ బోల్తా పడింది.
Read Also: Mahua Moitra: దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్.. మహువా మోయిత్రా కేసులో కీలక విషయాలు..
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా ప్రాంతంలోని మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మతియార్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, డైవర్ల బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. ప్రమాదానికి గురైన వారంతా రైతులే, డయారాలో వ్యవసాయ పనులు ముగించుకుని పడవలో ఇళ్లకు తిరిగి వస్తుండగా ఒకసారిగా సరయూ నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఒడ్డున ఉన్న గ్రామస్తులు పడవ మునిగిపోవడాన్ని గమనించి కేకలు వేశారు. దీంతో పడవలో ఉన్న వారిని రక్షించేందుకు ఘటన స్థలానికి వెళ్లే సరికే అప్పటికే పడవ మునిగిపోయింది. సంఘటన స్థలంలో ఎక్మా ఎమ్మెల్యే శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు. ఘటన స్థలంలో తీవ్ర అంధకారం నెలకొని ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!