Iran: ఇజ్రాయిల్‌కి ఆయిల్, ఆహారం నిలిపేయండి.. ముస్లిం దేశాలు ఇరాన్ సుప్రీంలీడర్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి క్రూరంగా ఊచకోత కోసింది. పిల్లలు, మహిళలనే తేడా లేకుండా చంపేసింది. ఈ దాడుల్లో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలను బందీలుగా చేసుకున్న హమాస్ తీవ్రవాదులు వారిని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో వేల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల 8 వేల మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ఈ నేపథ్యంలో గాజాస్ట్రిప్ పై బాంబు దాడుల్ని నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇజ్రాయిల్‌కి చమురు, ఆహార ఎగుమతులను నిలిపేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు. గాజాపై బాంబు దాడులు తక్షనమే ఆగిపోవాలి. జియోనిస్ట్ పాలనకు చమురు, ఆహార ఎగుమతుల మార్గాలని నిలిపేయాలని, అలీ ఖమేనీ ఒక ప్రసంగంలో పేర్కొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
మరోవైపు ఇరాన్‌తో పాటు ఇతర దేశాల హెచ్చరికలను ఇజ్రాయిల్ లెక్కచేయడం లేదు. హమాస్ సంస్థను లేకుండా చేస్తామని ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులతో పాటు భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. గాజా ప్రాంతంలోని హమాస్ ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదుల్ని వెతికి మరీ మట్టుబెడుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడుల వెనక ఇరాన్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!