Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సహా 22 యాప్స్, వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సహా 21 అక్రమ బెట్టింగ్ యాప్స్, సాఫ్ట్‌వేర్ మరియు వెబ్‌సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది. మహాదేవ్ యాప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్న క్రమంలో కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. మహాదేవ్ బుక్ మరియు రెడ్డిఅన్నాప్రెస్టోప్రోతో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Irfan Pathan: “గాజా”పై ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్.. పాకిస్తాన్ హిందువుల గురించి మాట్లాడాలన్న కనేరియా..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ఈడీ సిఫార్సుల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఉత్తర్వులను జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఈడీ విచారణ, ఛత్తీస్గఢ్ లోని మహాదేవ్ బుక్ చట్టవిరుద్ద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఛత్తీస్గఢ్ ఎన్నికల ముందు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ మెడకు చుట్టుకుంది. ఇటీవల ఈడీ రైడ్స్‌లో రూ.5 కోట్లతో ఓ కొరియర్ పట్టుబడ్డాడు. ఈ డబ్బును ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం బఘేల్ కి బెట్టింగ్ యాప్ ఓనర్ శుభమ్ సోని పంపాడని ఈడీ ముందు చెప్పినట్లు సమచారం. ఈ యాప్ ప్రమోటర్లు సీఎంకి రూ.508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ రోజు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ శుభమ్ సోని దుబాయ్ నుంచి ఓ వీడియోలో మాట్లాడారు. తనను దుబాయ్ వెళ్లమని సలహా ఇచ్చింది సీఎం బఘేల్ అని తెలిపారు.
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావాలంటే సెక్షన్ 69ఏ ఐటీ చట్టం ప్రకారం యాప్, వెబ్సైట్‌ని ఎప్పుడో మూసేసి ఉండొచ్చని, రాష్ట్రానికి ఆ అధికారం ఉందని అన్నారు. ప్రస్తుత మహదేవ్ కేసులో ఆ రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ భీమ్ సింగ్, మరో అనుమానితుడు అసిమ్ దాస్ మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కస్టడీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!