Mahadev App case: ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్‌కి ఈ కేసు చుట్టుకుంటోంది. ఇటీవల రూ.5 కోట్లతో ఈడీకి పట్టుబడిన కొరియర్, సీఎంకి యాప్ ప్రమోటర్లు రూ. 508 కోట్లు చెల్లించారని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ కావాలనే ఇలా చేస్తుందంటూ ప్రతివిమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే మహదేశ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సోని సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తనను దుబాయ్ వెళ్లమని సూచించారని ఈ కేసులో నిందితుడు వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సీఎం బఘేల్‌కి వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో మనీలాండరింగ్, అక్రమనిధుల వినియోగం వంటి ఆరోపణలు ఆయనపై వస్తున్నాయి.
Read Also: Minister Jogi Ramesh: వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు
మనీలాండరిగ్ కేసులో ఈడీకి బెట్టింగ్ యాప్ ఓనరైన శుభమ్ సోనీ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అతను ఈ రోజు దుబాయ్ నుంచి వీడియో రికార్డు చేసినట్లు సోర్సెస్ వెల్లడించాయి. ముఖ్యమంత్రి సూచన మేరకే తాను దుబాయ్ వెళ్లినట్లు సోని వీడియోలో చెప్పాడు. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కి తానే నిజమైన ఓనర్ని అని ఇందులో పేర్కొన్నాడు.
ఇటీవల ఈడీ దాడుల్లో రూ.5.39 కోట్లతో పట్టుబడిన కొరియర్ అసిమ్ దాస్.. ఆ డబ్బును భూపేష్ బఘేల్ కోసం శుభమ్ సోని పంపినట్లు వెల్లడించారు. ఈ ఆరోపణల తర్వాత సోని పంపిన ఈమెయిళ్లు పరిశీలించగా… ఇందులో ఇప్పటి వరకు సీఎం భూపేష్ బఘేల్‌కి రూ. 508 కోట్లను యాప్ ప్రమోటర్లు చెల్లించినట్లు ఉంది.