Israel-Hamas War: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి.. మరణం అంచున శిశువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గాజాను అంధకారంలో పడేసింది. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ దాడులు అక్కడి సాధారణ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ వరసగా దాడులను తీవ్రతరం చేయడంతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రైన అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోయిందని ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అల్ షిఫా ఆస్పత్రి కింద హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది. హమాస్‌ని ఎదుర్కోవాలంటే ఆస్పత్రులను ఖాళీ చేయాల్సిందే అని, ఆస్పత్రులను పటిష్ట స్థానాలుగా చేసుకుని హమాస్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఐడీఎఫ్ ఏదో సమయంలో గాజాలోని ఆస్పత్రుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
Read Also: Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఈ దాడుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇంధన అయిపోవడంతో ఆస్పత్రి కార్యకలాపాలు నిలిచిపోయాయని, ఇంక్యుబేటర్ లో ఉన్న ఒక శిశువుతో మరణించిందని, మరో 45 మంది పిల్లలు ఉన్నట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ ప్రకారం.. ఆస్పత్రిలో 39 మంది శిశువుల ప్రాణాలు రిస్కులో ఉన్నట్లు తెలిపింది. ఆక్సిజన్, మందులు అందకపోవడం, కరెంట్ లేకపోవడంతో వారు చనిపోయే అవకాశం ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడిగా ఓ ప్రకటనలో తెలిపింది.
అక్టోబర్ 7న గాజాలోని హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపేశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. మొదట వైమానిక దాడులకే పరిమితమైనప్పటికీ.. ప్రస్తుతం గాజాలోకి చొచ్చుకెళ్లి భూతల దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రపంచంలో ఏ దేశం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. హమాస్ పూర్తిగా అంతమైన తర్వాతే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయిల్ స్పష్టంగా తెలిపింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!