Anam Ramnarayana Reddy: భవంతుని సేవకు భక్తులను దూరం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ ప్రజలను అశాంతికి గురిచేసిందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రశాంతంగా నిన్నటి రోజున లక్షల మంది పూజలు చేశారని తెలిపారు. తాజాగా నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ రాజకీయ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని.. సోషల్ మీడియాలోనూ ప్రసాదాలు పై దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు.. వైసీపీ నేతలు నిసిగ్గుగా ప్రవర్తిస్తున్నారు.. ద్రాక్షారామం వ్యవహారంపై అధికారులు విచారణ చేస్తుంటే.. మరో వైపు ఆ రాజకీయపార్టీ సోషల్ మీడియాలో దిగజారుడు విధానంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తుందని చెప్పారు.. నత్తను తెచ్చి ప్రసాదంలో పెట్టి ఒక కథలాగా నడిపారని.. వైసీపీ ప్రధాన భూమిక పోషించింది. నీచాతి నీచమైనా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
READ MORE: Warren Buffett: లెజండరీ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ రాజీనామా..
40మంది సిబ్బందిని నియమించుకుని ఆలయాలుపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. పోలీసులు విచారణ చేపట్టారు. కొండరాజీవ్ అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా నడుపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొలేక వైసీపీ కుతంత్రాలు చేస్తుంది.. ద్రాక్షారామం, సింహాచలం, తిరుపతి వంటి ఆలయాలుపై మరీచులాంటి రాక్షలు వచ్చి పడ్డారని మండిపడ్డారు. ఆలయాలు కాపాడటానికి రామ లక్ష్మణలులాంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.
READ MORE: India Billionaires: 2025 సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన ముఖేష్ అంబానీ.. టాప్-10లో ఎవరున్నారంటే?