Lithium Mining: లిథియం, కోబాల్ట్ వేలం.. 20 బ్లాకులకు రూ. 45,000 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lithium Mining: ప్రపంచంలోనే అత్యంత విలువైన మూలకాల్లో ఒకటిగా ఉన్న లిథియం, కోబాల్ట్, టైటానియం, కోబాల్ట్ మూలకాల వేలాన్ని బుధవారం కేంద్రం ప్రారంభించింది. తొలి విడతగా 20 బ్లాకులను వేలం వేయనున్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటి విలువ రూ. 45,000 కోట్లు ఉంటుందని చెప్పారు. మొత్తం 100 బ్లాకులను వేలం కోసం గుర్తించామని, వీటిలో తొలి విడతగా 20 బ్లాకుల్ని వేలం వేస్తున్నామని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ 20 బ్లాకులు ఉత్తరప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నాయి.
Read Also: Sniffer Dog: నువ్వు కుక్కవి కాదు ‘లియో’వి.. తప్పిపోయిన చిన్నారిని 3 గంటల్లోనే కనుగొంది..
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ఈ 20 బ్లాకుల్లో 16కి కాంపోజిట్ లైసెన్సులు జారీ చేస్తారు, మిగిలిన నాలుగింటికి లైసెన్సులు జారీ చేయబడుతాయి. కాంపోజిట్ లైసెన్సుల కింద నిల్వల అణ్వేషణ అనుమతించబడుతుంది. టెండర్ కోట్ చేసిన వారిలో అత్యధిక రాయల్టీ రేట్ల ఆధారంగా బిడ్డర్లను కేంద్రం ఎంపిక చేయనుంది. టెండర్ డాక్యుమెంట్ల విక్రయం బుధవారం నుంచే ప్రారంభమవుతుంది. గనులు, ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, ప్రకారం ఆగస్టులో 24 ఖనిజాలను క్రిటికల్, స్ట్రాటజిక్ ఖనిజాలుగా నోటిఫై చేసింది.
ముఖ్యంగా గతేడాది జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలో భారీ ఎత్తున లిథియం నిల్వలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ప్రస్తుత జనరేషన్‌లో మొబైళ్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు బ్యాటరీల్లో లిథియంని వాడుతున్నారు. సోలార్ ఎనర్జీని స్టోర్ చేయాలంటే బ్యాటరీలు చాలా అవసరం. 2030 నాటికి శిలాజ ఇంధనాల స్థానంలో సోలార్ ఎనర్జీ వంటి శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచాలని భారత్ అనుకుంటోంది. దీనికి లిథియం చాలా కీలకం. కోబాల్ట్ స్టోరేజ్ అప్లికేషన్స్‌లో కీలకమైన మూలకం. టైటానియం రక్షణ పరిశ్రమలో విస్తృతంగా వినియోగిస్తారు. భవిష్యత్ సాంకేతికతలు లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, టైటానియం వంటి రేర్ ఎర్త్ మూలకాలపై ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!