PM Modi: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ విజయవంతమైంది. ఉత్తరకాశీలో నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో 41 మంది అందులోనే చిక్కుకుపోయారు. గత 17 రోజులుగా అందులో చిక్కుకుపోయిన కార్మికులు సురక్షితంగా ఉండాలని దేశం మొత్తం ప్రార్థించింది. తాజాగా ఈ రోజు 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ర్యాట్-హోల్ మైనింగ్ ద్వారా టన్నెల్ లోపలికి మార్గాన్ని ఏర్పాటు చేసి, చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించడానికి ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా కార్మికులు చిక్కుకుపోయిన ప్రదేశానికి రెస్క్యూ టీం చేరుకుంది.
LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తమిళ నేత వైకో ప్రభాకరన్ జయంతి సభలో మాట్లాడుతూ.. ఇంకా టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని, త్వరలో బయటకు వస్తారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురిని అని చెప్పుకునే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rozgar Mela: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోతున్న 51,000 మందికి ‘రోజ్‌గార్ యోజన’ కింద జాబ్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. నవంబర్ 30న ప్రధాని చేతుల మీదుగా వారిందకిరి ఉద్యోగ నియామక పత్రాలను అందుకోనున్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని మంగళవారం పీఎం కార్యాలయం తెలిపింది. 'రోజ్‌గార్ మేళా'లో భాగంగా దేశవ్యాప్తంగా 37 ప్రదేశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో నియామకాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Honour killing: ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్లో కొందరు మతఛాందసవాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. దీంతో అక్కడ అమ్మాయిలు, మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉంటున్నాయి. ఇదే కాకుండా పరువు హత్యల విషయంలో పాకిస్తాన్ టాప్ పొజిషన్లో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ప్రేమించుకుంటున్న అక్కడ అమ్మాయిలను సొంత బంధువులు, కుటుంబ సభ్యులే క్రూరంగా హత్య చేస్తున్నారు.
World Cup: భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతితో భారత్ ఓడిపోయింది. ఈ బాధ నుంచి ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కోలుకోలేకపోతున్నారు. అయితే భారత ఓటమిపై పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మన దేశంలో కూడా ఇలాంటి జాతి వ్యతిరేకులు ఉన్నారు. భారత్ ఓడిపోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు, తినేది ఈ దేశ తిండి కానీ వేరే దేశానికి మద్దతు తెలుపుతున్నారు.
Free Tourist Visas: శ్రీలంక దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై ఆ దేశం మరింత దృష్టి పెట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం టూరిస్టులను ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువ పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మన దేశానికి చెందిన పౌరులకు ‘ఫ్రీ టూరిస్ట్ వీసా’లను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషషన్ శాఖ కొలంబోలో ప్రకటించింది.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని, అయితే అమెరికా ఈ కుట్రను భగ్నం చేసిందని ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై అమెరికా తన ఆందోళనను భారత్‌కి తెలియజేసింది. అమెరికా లేవనెత్తిన అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. పంజాబ్‌ని భారత్ నుంచి వేరు చేయాలనే ఉద్దేశంతో పన్నూ, కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి చోట్ల ఖలిస్తాన్ రెఫరెండానికి మద్దతు ఇస్తున్నాడు. మరోవైపు ఇతనికి పాకిస్తాన్,…
Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి వచ్చింది. మరికొద్ది సేపటిలో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు బయటకు రాబోతున్నాయి. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ కుప్పకూలిపోవడంతో గత 17 రోజులుగా కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. అయితే అప్పటి నుంచి అధికారులతో పాటు విదేశాలకు చెందిన టెన్నెల్ నిపుణులు ఈ ఆపరేషన్‌లో భాగమవుతున్నారు. మరికొద్ది సేపట్లో కార్మికులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్లింది.
South Africa: దక్షిణాఫ్రికా ప్లాటినం గనిలో భారీ ప్రమాదం జరిగింది. గనిలోకి కార్మికులను తీసుకెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారి కూలిపోయింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా 200 మీటర్లు కిందకి పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. 75 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు మంగళవారం తెలిపారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రస్టెన్‌బర్గ్ నగరంలోని గనిలో కార్మికులు విధులు ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.