Kia Sonet facelift: కొరియన్ కార్ మేకర్ కియా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించింది. కియా నుంచి సోనెట్, సెల్టోస్, కారెన్స్, ఈవీ6 వాహనాలు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పటికే తన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసిన కియా, తాజాగా కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డిసెంబర్ 2023లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. జనవరి 2024 నుంచి ఈ కార్ లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది. కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో కేవలం కాస్మెటిక్ మార్పులే కాకుండా.. కొత్త ఫీచర్లు, టెక్నాలజీ పరంగా మరింత అధునాతనంగా ఉండబోతోంది.
ఇంజిన్ వివరాలు:
2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 3 ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. 83 హెచ్‌పీ 1.2 లీటర్ పెట్రోల్, 120 హెచ్‌పీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 116 హెచ్‌పీ 1.5 లీటర్ డిజిల్ ఇంజన్ ఆప్షన్లతో రాబోతోంది. 5 స్పీడ్ మాన్యువల్, టర్బో పెట్రోల్ కోసం 6 స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ డీసీటీతో పాటు డిజిల్ ఇంజిన్ కోసం 6-స్పీడ్ ఐఎంటీ, 6- స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్లు అందుబాటులో ఉండనున్నాయి.
READ ALSO: USA: అమెరికాలో తాత, మామలను కాల్చిచంపిన భారతీయ విద్యార్థి..
సరికొత్త ఫీచర్లు:
ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే..సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రీప్రొఫైల్డ్ ఫ్రంట్ బంపర్, కొత్త కియా ఫ్రంట్ గ్రిల్, LED హెడ్‌లైట్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. వెనకభాగంలో కొత్తగా టెయిల్ గేట్ డిజైన్, ఎల్ఈడీ టెయిల్‌గేట్ వంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త డిజిటర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉండే అవకాశం ఉంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, స్విచ్ గేర్ అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్తగా కియాసోనెట్‌లో ADAS ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం కియా సోనెట్ ధర రూ. 8లక్షలు( ఎక్స్-షోరూం) ప్రారంభ ధరగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ వంటి బలమైన ప్రత్యర్థులకు సోనెట్ కాంపిటీషన్‌గా ఉండబోతోంది.