Gaumutra remark: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన ‘గోమూత్ర రాష్ట్రాలు’ అనే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ‘‘బీజేపీ హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో, అంటే మేము వీటిని గోమూత్ర రాష్ట్రాలని పిలుస్తామని వాటిలోనే గెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ గెలవదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఫలితాలు చూస్తునే ఉన్నాం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
BJP MPs Resign: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాషాయ జెండాను ఎగరేసింది. అయితే ఈ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను నిర్ణయించే విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న సీఎంలు మార్చి కొత్త ముఖాలను తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
NCRB Report: దేశంలో అత్యధిక ఆత్మహత్యలు ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజా నివేదిక పేర్కొంది. ప్రతీ లక్ష మంది జనాభాకు సిక్కింలోనే అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యాయి. సిక్కింలో 43.1 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి.
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్ని.. ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. మహీంద్రా నుంచి ఆఫ్ రోడర్‌గా ఉన్న థార్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకీ జిమ్నిని మార్కెట్లోకి దించింది. థార్‌లో ఉన్న నెగిటివ్ పాయింట్ అయిన 5-డోర్ సమస్యను పరిష్కరిస్తూ.. జిమ్ని 5-డోర్‌తో వచ్చింది.
Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో దాదాపుగా గత ఏడాదిన్నరగా రష్యాకే పరిమితమైన ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం పలు దేశాల పర్యటకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కిర్గిజ్ స్థాన్లో పర్యటించిన పుతిన్, ఆ తర్వాత చైనాకు వెళ్లారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిలీ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఉత్తర గాజాకే పరిమితమైన యుద్ధా్న్ని, దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. హమాస్ ఉగ్రసంస్థను లేకుండా చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఆ దేశ స్పై ఏజెన్సీ మొసాద్కి హమాస్ కీలక నేతలను హతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
Shark Attack: పెళ్లైన తర్వాతి రోజు మృత్యువు షార్క్ రూపంలో వచ్చింది. నవ వధువుపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన బహామాస్‌లో జరిగింది. తన భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పాడిల్ బోర్డింగ్ చేస్తుండగా, షార్క్ అటాక్ చేసింది. బోస్టన్‌కి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆదివారమే వివాహం జరిగిందని, సోమవారం బీచ్‌లో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా, ఈ భయంకరమైన దాడి జరిగింది.
INDIA bloc: ఇండియా కూటమి సమావేశానికి తేదీ ఖరారైంది. బుధవారం సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ, పలువురు కీలక నేతలు గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరో తేదీన ఇండియా కూటమి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా డిసెంబర్ 17 కూటమి నేతల భేటీ జరుగుతుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం తెలిపారు.
Revanth Reddy: తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం చేసి, సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేశారు. నిన్నటి నుంచి హైకమాండ్ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై తలమునకలై ఉంది.
India-Pak: ఇటీవల కాలంలో పాకిస్తాన్ యువతులు, ఇండియన్ అబ్బాయిలకు పడిపోతున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ యువతి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు వచ్చింది. కోల్‌కతాకు చెందిన వ్యక్తి సమీర్ ఖాన్ని పెళ్లి చేసుకునేందుకు కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ భారత్ వచ్చింది.మంగళవారం వాఘా-అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి భారతదేశానికి చేరుకుంది.. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. కాబోయే కోడలికి భర్త సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.