DMK MP: డీఎంకే ఎంపీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ మంగళవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుంది. బీజేపీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రధానంగా హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో లేదా మేము గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తాము వీటిలో బీజేపీ గెలుస్తుందని, మీరు దక్షిణ భారతదేశానికి రాలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూస్తే ఇది…
India Bloc: కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. బుధవారం కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు రావడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించింది. అయితే నేపథ్యంలో కీలక రాష్ట్రాల్లో దారుణ ఓటమి తర్వాత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునివ్వగా బీహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ మీటింగ్‌ని దాటవేయాలని అనుకుంటున్నారు.
Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ వరస భూకంపాలతో భయపడుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళతో ఉన్నారు. తాజాగా దేశంలోని లుజోన్‌లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్‌లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Kamal Nath: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. గత 2 దశాబ్ధాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. మరో 5 ఏళ్లు కూడా బీజేపీ అధికారంలో కొనసాగబోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 163 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.
Safest City: వరసగా మూడో ఏడాది కూడా ఇండియాలో అత్యంత సురక్షిత నగరంగా కోల్‌కతా రికార్డు సృష్టించింది. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇతర నగరాలో పోలిస్తే నేరాలు తక్కువగా నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) తన నివేదికలో తెలిపింది. మహానగరాల్లో ప్రతీ లక్ష మంది జనాభాకు అతి తక్కువ నేరాలు నమోదు చేసిందని వెల్లడించింది. 2022లో ఈ నగరంలో ప్రతీ లక్ష మందికి 86.5 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి.
Khalistani terrorist: భింద్రన్‌వాలే మేనల్లుడు ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ పాకిస్తాన్లో మరణించాడు. భారత వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్న ఇతను చాలా కాలంగా పాకిస్తాన్‌లోనే ఉంటున్నాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక, ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. ఇతనికి పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
PM Modi: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో అధికారం చేపట్టబోతోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోడీ ‘చారిత్రక, అపూర్వ’ విజయంగా కొనియాడారు.
BJP: తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్నా.. అధికారంలో కోసం పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్నామ్నాయమని చెప్పుకున్న బీజేపీ గతంలో కన్నా మెరుగైన సీట్లను, ఓట్ షేర్ని సాధించింది. 2018 ఎన్ని్కల్లో 7 శాతం ఓట్ షేర్‌తో కేవలం ఒకే స్థానాన్ని గెలిచిన బీజేపీ ఈ సారి ఏకంగా 14 శాతం ఓట్లను సాధించి 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.