Mass Killing: యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని చంపేసి వైద్యుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mass Killing: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా రాయ్‌బరేలీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సిటీలోని రైల్వే కాలనీలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ అరుణ్ కుమార్ రైల్వేలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కంటి నిపుణుడు అయిన అరుణ్ కుమార్ రాయ్ బరేలీలోని మెడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.
అయితే అతను గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని స్వస్థలం మీర్జాపూర్, ఉద్యోగరీత్యా రాయ్‌బరేలీలో ఉంటున్నారు. చివరిసారిగా ఆదివారం రోజున కనిపించాడు. రెండు రోజులుగా విధులకు రాకపోవడంతో అతని సహచర ఉద్యోగులు అతని ఇంటికి వెళ్ళారు. అయితే డోర్ బెల్ ఎంత కొట్టినా బయటకు రాకపోవడంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లడంతో వారంతా షాక్‌కి గురయ్యారు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
భార్య అర్చన, కుమార్తె ఆదివా(12), కుమారుడు ఆరవ్ (4) మృతదేహాలు కనిపించాయి. ఘటనాస్థలంలో సుత్తి, రక్తపు మరకలు, ఇంజెక్షన్లు లభించాయి. ఇదంతా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా పిల్లల్ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. డాక్టర్ ముందుగా వీరిని చంపేసి ఆ తర్వాత మణికట్టు కోసుకున్నాడు, అది విఫలం కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు.
డాక్టర్ తన రోగులతో, ఇతరులతో మంచిగానే ప్రవర్తించే వాడని, కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. పోలీసులు సహోద్యోగుల్ని, ఇతర స్థానికులను విచారించగా.. ఇటీవల డాక్టర్ అరుణ్ కుమార్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని, అన్నింటికి కోపం తెచ్చుకుంటున్నాడని తెలిసింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!