PM Benjamin Netanyahu: “యూదు స్త్రీలు కాబట్టే మౌనంగా ఉన్నారా..?” హక్కుల సంఘాలపై ఇజ్రాయిల్ పీఏం ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Benjamin Netanyahu: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, ఐక్యరాజ్యసమితిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ మహిళలపై హమాస్ చేస్తున్న అత్యాచారాలు, దురాగతాలపై మాట్లాడటంతో ఇవన్నీ విఫలమయ్యాయని బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ మహిళలపై అత్యాచారారాలు, భయంకరమైన అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు’’ అని ఎక్స్(ట్విట్టర్)ద్వారా ప్రశ్నించారు.
నాగరిక దేశాలు, ప్రభుత్వాలు, నాయకులు, ప్రభుత్వాలు ఈ దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. టెల్ అవీవ్‌లో రక్షణ మంత్రి యోవ్ గాలంట్, బెన్నీ గాంట్జ్‌తో కలిసి ప్రధాని నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. విడుదలైన బందీలు వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారని చెప్పారు. లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాల గురించి తెలసుకున్నానని..దీనిపై మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు మొరపెట్టుకున్నా వినలేదని, యూదు స్త్రీలు కాబట్టే మౌనంగా ఉన్నారా?? అని నెతన్యాహు ప్రశ్నించారు.
Also Read
Read Also: Floods: ఒక్క చెన్నై మాత్రమే కాదు.. శతాబ్దం చివరి నాటికి వరద ప్రమాదంలో 12 నగరాలు..
మీరంతా యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటే.. ఇజ్రాయిల్‌కి మద్దతు ఇవ్వండి, హమాస్‌ని అణిచివేయడమే యుద్ధాన్ని ముగించేందుకు ఉన్న ఏకైక మార్గమని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్-హమాస్ మధ్య దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు చర్చిస్తున్నాయి. దీర్ఘ కాలిక కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే మిగతా బందీలను విడుదల చేస్తామని హమాస్ షరతు పెడుతున్నట్లుగా సమాచారం. ఇటీవల కుదిరిన సంధితో 240 మంది బందీల్లో కొంతమందిని హమాస్ విడుదల చేసింది, ప్రస్తుతం హమాస్ వద్ద 137 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!