New Covid Variant JN.1: భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కేసులు 21 నమోదయ్యాయి. కోవిడ్ టెస్టులను ల్యాబుల్లో పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
Man Beheads Wife: ‘‘టీ’’ వివాదం భార్యభర్తల మధ్య గొడవకు కారణమైంది. చివరకు భార్య తలను భర్త నరికేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఉదయం టీ తీసుకురావడం ఆలస్యమైందనే కారణంలో 52 ఏళ్ల వ్యక్తి మంగళవారం తన భార్యను కత్తితో నరికి చంపాడు. టీ చేయడంతో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో కోపం పట్టలేక ధరమ్వీర్ అనే వ్యక్తి 50 ఏళ్ల తన భార్య…
Punjab: వరస ఎన్కౌంటర్లతో పంజాబ్ రాష్ట్రం దద్దరిల్లులోంది. అక్కడి భగవంత్ మన్ సర్కార్ గ్యాంగ్స్టర్లు, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ స్మగ్లర్లు, ఇతర నేరస్తులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో పది కన్నా ఎక్కువ ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి.
PM Modi: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా న్యాయశాఖ అభియోగాలను మోపింది. నిఖిల్ గుప్తా అనే భారతీయుడు కుట్రకు పాల్పడినట్లు, అతనికి భారత ప్రభుత్వం ఉద్యోగి సహకరించినట్లు ఆరోపిస్తోంది. అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ దేశం నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేసింది. అతడిని తమకు అప్పగించాలని యూఎస్ కోరుతోంది. ఇదిలా ఉంటే ఈ పన్నూ వ్యవహారంలో భారత్-యూఎస్ రెండూ కూడా ఉన్నత స్థాయిలో చర్చించుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇండియా విచారణ కోసం ఉన్నతస్థాయి…
Israel-Hamas: ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్ పక్షాన నిలబడింది. అయితే యూఎస్‌లో జరిగిన ఓ పోల్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యంగ్ అమెరికన్లు హమాస్‌కి మద్దతుగా నిలుస్తు్న్నట్లు తేలింది. చాలా మంది యువ అమెరికన్ పౌరులు ఇజ్రాయిల్ ఉనికి కోల్పోవాలని, గాజాను నియంత్రిస్తున్న హమాస్‌కే అప్పగించాలనే అభిప్రాయాలను వెల్లడించినట్లుగా పోల్‌లో తేలింది.
Punjab: పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు.
Bihar: పూజారి దారుణహత్య బీహార్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆరు రోజుల క్రితం కిడ్నాప్ అయిన పూజారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. కళ్లను పొడిచి, జననాంగాలను కోసేసిన స్థితితో మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ హత్య స్థానికుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీసులకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. గోపాల్ గంజ్ జిల్లాలోని దానాపూర్ గ్రామంలో శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఆయన బీజేపీ మాజీ డివిజనల్…
Arif Mohammed Khan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా పరిస్థితి మారింది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల కాలికట్ యూనివర్సిటీకి గవర్నర్ వెళ్లిన సమయంలో అధికార సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడం మరోసారి వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై గవర్నర్ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ టార్గెట్‌గా నేరుగా విమర్శలకు దిగారు.
General election-2024: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు డిసెంబర్ 21న కాంగ్రెస్ కీలక భేటీకి పిలుపునిచ్చింది. బీజేపీని ఢీకొట్టేందుకు, ఎన్నికల ప్రచారాన్ని రంగంలోకి దించేందుకు ప్రణాళికలను రూపొందించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అది కూడా 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, సభ జరిగే సమయంలో ఛాంబర్ లోకి దూసుకెళ్లి పొగ క్యానిస్టర్లను పేల్చారు.