Israel-Hamas: ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్ పక్షాన నిలబడింది. అయితే యూఎస్‌లో జరిగిన ఓ పోల్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యంగ్ అమెరికన్లు హమాస్‌కి మద్దతుగా నిలుస్తు్న్నట్లు తేలింది. చాలా మంది యువ అమెరికన్ పౌరులు ఇజ్రాయిల్ ఉనికి కోల్పోవాలని, గాజాను నియంత్రిస్తున్న హమాస్‌కే అప్పగించాలనే అభిప్రాయాలను వెల్లడించినట్లుగా పోల్‌లో తేలింది.
హర్వర్డ్-హారిస్ పోల్ పేరుతో ఈ వారం ఓ పోల్ నిర్వహించారు. 18-24 ఏళ్ల వయసున్న అమెరికన్లలో 51 శాతం పాలస్తీనా-ఇజ్రాయిల్ వివాదానికి సమూలపైన పరిష్కారానికి మద్దతు ఇచ్చారు. వీరంతా యూదు రాజ్యం స్థానంలో హమాస్ పాలన రావాలని కోరుకున్నట్లు వెల్లడైంది. ఇజ్రాయిల్-పాలస్తీనా టూ స్టేట్ పాలసీకి 32 శాతం మంది మొగ్గు చూపగా.. కేవలం 17 శాతం మంది అరబ్ దేశాలు పాలస్తీనియన్లను తీసుకోవాలని సూచించారు. తాజాగా యువ అమెరికన్లలో ఈ వైఖరి పాత తరానికి భిన్నంగా ఉంది. ఇదిలా ఉంటే 65 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వారిలో 4 శాతం మంది మాత్రమే ఇజ్రాయిల్ అంతం కావాలని కోరుకుంటున్నట్లు తేలింది. ఈ వైఖరిపై సెనెటర్ రోజర్ మార్షల్ హెచ్చరికలు చేశారు. హమాస్‌కి మద్దతు తెలుపుతున్న యువతపై వ్యాఖ్యానిస్తూ.. వారు అమెరికాను ద్వేషించే నిజమైన ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతున్నారని అన్నారు.
Read Also: Sridhar Babu: గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవు.. శ్రీధర్ బాబు కామెంట్
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై జరిపిన దాడిని 18-24 ఏళ్ల వయసున్న వారిలో 60 శాతం మంది సమర్థించారు. 58 శాతం మంది హమాస్, ఇజ్రాయిల్‌పై మారణహోమం చేయాలనుకుంటుందని అంగీకరించారు. వీరిలో 60 శాతం మంది గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ మారణహోమానికి పాల్పడుతుందని ఆరోపించారు. 53 శాతం యువ అమెరికన్లు ‘‘యూదుల మారణహోమానికి’’ పిలుపునిచ్చే హక్కు విద్యార్థులకు ఉండాలని చెప్పారు.
పోల్‌లో యువ అమెరికన్లు, పెద్ద వారి మధ్య క్లియర్‌గా విభజన తీసుకువచ్చింది. మొత్తంగా చూస్తే 80 శాతం కంటే ఎక్కువ అమెరికన్లు ఇజ్రాయిల్ వైపే నిలబ్డడారు. ఇజ్రాయిల్-గాజా పరిణామాలను మొత్తంగా 69 శాతం గమనిస్తున్నామని చెప్పగా.. ఇది 18-24 ఏళ్ల వర్గంలో 81 శాతం ఉందని పోల్ వెల్లడించింది. యువ అమెరికన్లు ఇతర వర్గాల కంటే ఎక్కువగా హమాస్ వైపు మొగ్గు చూపారు. 57 శాతం అమెరికన్ ముస్లింలు ఇజ్రాయిల్‌పై హమాస్ దాడిని సమర్థించారు. అయితే ఇంతలా యువ అమెరికన్లు హమాస్ వైపు మొగ్గుచూపడానికి తప్పుడు సమాచారం, టిక్ టాక్ ప్రభావం ఉందని పలువురు చెబుతున్నారు.