Boat Sink: అంతర్యుద్ధాలు, తీవ్రవాదం, హింస నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటూ ప్రతీ ఏడాది కొన్ని వేల మంది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారు సముద్రంలో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా మరోసారి లిబియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. లిబియా మధ్యదరా సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది.
PM Modi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అత్యంత సీరియస్ చర్యలు తీసుకుంటున్నారని, ఈ ఘటనను తక్కువగా అంచనా వేయవద్దని ప్రధాని అన్నారు. ‘‘ పార్లమెంట్లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందువల్ల స్పీకర్ అత్యంత సీరియస్‌గా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు’’ అని చెప్పినట్లు నేషనల్ మీడియా కథనాలను ప్రచురించింది.
Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్లో ఇప్పుడు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపుతారో అని టెర్రరిస్టులు భయపడుతున్నారు. ఇటీవల జరగుతున్న హత్యలతో వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ముఖ్యమైన ఉగ్రనేతలు అంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 16 మంది ఉగ్ర నేతలను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో పాకిస్తాన్ గడ్డపైనే హతమయ్యారు. రెండేళ్లలో 18 మంది టెర్రరిస్టులు హత్యకు గురయ్యారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ […]
Kerala: కామాంధులు రెచ్చిపోతున్నారు. వావీవరసలు, చిన్నా పెద్దా అనే తేడాను మరించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటికి భయపడటం లేదు. దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా వరకు ఇలాంటి ఘటనలు తెలిసిన వారిని నుంచే ఎక్కువగా ఎదురవుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో మహిళల్ని మభ్యపెట్టి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
Marriage fraud: ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిని అని, ఎన్ఐఏ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఓ వ్యక్తి ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కాశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన వ్యక్తి మారుపేర్లు, వేషధారణతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళల్ని మోసం చేస్తూ.. ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు, దీంతో పాటు ఇతనికి పాకిస్తాన్‌లోని పలువురితో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
NIA: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఈ సంస్థలో సంబంధాలు ఉన్న వ్యక్తుల కోసం వేటాడుతోంది. ఇదిలా ఉంటే ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేరళతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు, కీలక నేతలపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలకు చెందిన ముగ్గురి కోసం పారితోషకం ప్రకటించింది. వీరికి సంబంధించిన…
COVID-19: 2019 చైనాలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ మహమ్మారి అనతికాలంలోనే ప్రపంచాన్ని మొత్తం వ్యాపించింది. చైనా, ఇండియా, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో లక్షల్లో మరణాలకు కారణమైంది. చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ఎక్కువైంది. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది.
Devendra Fadnavis: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఫడ్నవీస్, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ‘ రాహుల్ గాంధీ బీజేపీకి దేవుడు ఇచ్చిన వరం.. ప్రతిపక్ష నేత ఇలాగే ఉంటే మనం అదృష్టవంతులుగా భావించాలి’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేత ఉండటం బీజేపీకి అదృష్టాన్ని తీసుకువస్తోందని అన్నారు.
POCSO Case: మహిళలు, బాలికను అసభ్యం తాకడమే కాదు, వారిని ఉద్దేశించి అనుచితంగా కామెంట్స్ చేసినా కూడా నేరం కిందే పరిగణించబడుతుంది. అవి కూడా లైంగిక వేధింపులగానే భావించబడుతాయి. తాజాగా ఇలాంటి కేసులోనే ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఓ మైనర్ బాలికను అనుచితంగా తాకి, ‘‘హాట్’’ అంటూ కామెంట్ చేసినందుకు 50 ఏళ్ల వ్యక్తికి ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నేరం రుజువైంది.
North Korea: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా లేదా దాని మిత్ర రాజ్యాలపై అణుదాడి జరిగితే అది ఆమోదయోగ్యం కాదని, ఈ పరిణామాలు కిమ్ పాలనకు ముగింపు పలుకుతాయని అమెరికా-దక్షిణ కొరియా ఒక సంయుక్త ప్రకటనలో శనివారం తెలిపాయి.