Bhagavad Gita: లక్ష మంది భగవద్గీత పఠనం.. బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavad Gita: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన ‘భగవద్గీత పఠనం’ బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ హిందూ ఐక్యతను ప్రోత్సహిస్తోందని, హిందూ ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోల్‌కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో భగద్గీత పఠనానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ యూనిట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపుగా 1,20,000 మంది ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కోల్‌కతాలో జరిగిన ‘లోఖే కొంతే గీతాపథం’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. భగవద్గీత ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక అని, ఈ కార్యక్రమాన్ని హేళన చేసిన వారికి హిందూ ధర్మ, సంప్రదాయాల పట్ల గౌరవం లేదని, హిందువులను విభజించడంలో విఫలం అవుతున్నారంటూ.. పరోక్షంగా టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం రాష్ట్రంలో హిందువులను ఐక్యం చేస్తుందని, భగవద్గీత పఠించడమే కాకుండా, హిందువులను ఐక్యం చేయడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. గీతా పారాయణంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ బీజేపీ నేతలు మాత్రం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని, మతాన్ని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటే అని దుయ్యబట్టారు. టీఎంసీ మంత్రి ఉదయన్ గుహా మాట్లాడుతూ.. గీతాపారయణ కార్యక్రమం బదులుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ని నిర్వహించొచ్చని, బెంగాల్ ప్రజలు ఇలాంటి వాటిని పట్టించుకోరని అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!