Parking: ఇటీవల కాలంలో పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు భౌతికదాడుల వరకు వెళ్తున్నాయి. తాజాగా న్యూ ఇయర్ రోజు పార్కింగ్ వాగ్వాదం ఒకరి మరణానికి కారణమైంది. ఘజియాబాద్‌లోని మోడీ నగర్లో పార్కింగ్ వివాదంతో కోపం పెంచుకున్న ఓ వ్యక్తి తన ఎస్యూవీ కార్‌తో 30 ఏళ్ల వ్యక్తిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Assam: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం గోలాఘాట్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. 27 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమపంలోని బలిజన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ రాజేస్ సింగ్ తెలిపారు.
ED Raids: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్‌లో ఉంది.
BYD: చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD సత్తా చాటుతోంది. ఈవీ కార్ల అమ్మకాల్లో అమెరికా దిగ్గజ సంస్థ, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లాను అధిగమించింది. 2023 నాలుగో త్రైమాసికంలో టెస్లా 4,84,507 వాహనాలను విక్రయించింది. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం అధికం. అయితే టెస్లా ప్రత్యర్థి, చైనీస్ టెస్లాగా పిలువబడే BYD ఇదే కాలానికి 5,26,409 కార్ల అమ్మకాలను నివేదిందించింది. నాలుగో త్రైమాసికంలో BYD, టెస్లాను అధిగమించింది.
BJP: ప్రజలకు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ‘ఉచితాలు’ ఇవ్వడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారే అవకాశం ఉందని చెబుతోంది. ఉచితాలు కాకుండా ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోంది. గతేడాది కర్ణాటక ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఉచితాల రాష్ట్రాలు అప్పులపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
UK: యూకేలో ఒక విచిత్రమై "గ్యాంగ్ రేప్" కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా ఆన్లైన్ ‘మెటావర్స్’లో సామూహిక అత్యాచారం జరిగినట్లు, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్చువల్ రియాలిటీ గేమ్‌లో 16 ఏళ్ల బాలిక డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై బాలిక తీవ్ర మనోవేధన అనుభవిస్తున్నట్లు ది న్యూయార్క్ వార్తాసంస్థ నివేదించింది.
Bab el-Mandeb: ఇజ్రాయిల్-హమాస్ నేపథ్యంలో ఎర్ర సముద్రంతో పాటు అంతర్జాతీయ నౌకా రవాణాకు కీలకమైన పలు ప్రాంతాల్లో యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, ఆ దేశంతో సంబంధం ఉన్న కార్గో నౌకలపై డ్రోన్లతో దాడులు జరుపుతుండటంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Insurance Money: డబ్బుల కోసం స్నేహితుడినే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసేందుకు ఫ్రెండ్‌ని చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చోటు చేసుకుంది. చెన్నైలో తన పేరిట ఉన్న రూ.1 కోటి ఇన్సూరెన్స్ డబ్బును పొందేందుకు తాను మరణించినట్లుగా డ్రామా క్రియేట్ చేసి, తన పోలికలతో ఉన్న మరో వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరు నిందితుడితో సహా అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Dr Saveera Parkash: డాక్టర్ సవీరా ప్రకాష్ పేరు ఇప్పుడు పాకిస్తాన్ లోనే కాదు ఇండియాలో కూడా ఫేమస్ అయింది. ఫిబ్రవరిలో పాకిస్తాన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సవీరా ప్రకాష్ నిలిచారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన పాక్ వంటి దేశంలో ఓ హిందువు అదికూడా ఓ మహిళ ఎన్నికల బరిలో నిలబడటం చర్చనీయాంశంగా మారింది.
Hit-And-Run Law: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన హిట్-అండ్-రన్ చట్టంపై దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనలకు పిలుపునిచ్చారు. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. మరోవైపు సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు బంకుల ముందు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిన్న ట్రక్ సంఘాలతో సమావేశం నిర్వహించింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ట్రక్కర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.