UK: 16 ఏళ్ల బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: యూకేలో ఒక విచిత్రమై “గ్యాంగ్ రేప్” కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా ఆన్‌లైన్ ‘మెటావర్స్’లో సామూహిక అత్యాచారం జరిగినట్లు, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్చువల్ రియాలిటీ గేమ్‌లో 16 ఏళ్ల బాలిక డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై బాలిక తీవ్ర మనోవేధన అనుభవిస్తున్నట్లు ది న్యూయార్క్ వార్తాసంస్థ నివేదించింది.
టీనేజ్ బాలిక ఆన్‌లైన్ గేమ్‌లో లీనమై ఉండగా.. కొంతమంది పురుషులు ఆమె క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. అయితే వాస్తవంగా బాలికపై అత్యాచారం జరగకున్నా, ఎలాంటి గాయాలు కాకున్నా కూడా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక బాధను అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి వర్చువల్ లైంగిక నేరం ఇదే అని భావిస్తున్నారు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
Read Also: Bab el-Mandeb: బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిలో కార్గో షిప్‌కి సమీపంలో పేలుళ్లు…
బాలికపై శారీరకంగా అత్యాచారం జరగలేదు.. కానీ మానసికంగా ఆమె బాధను అనుభవిస్తోందని, ఇది ఎక్కువ కాలం ఆమెపై ప్రభావం చూపించే అవకాశం ఉందని యూకే పోలీస్ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలాంటి కేసులపై ప్రత్యేకంగా చట్టాలు లేవని, దీంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే, బాలిక ఏ గేమ్ ఆడుతుందనేది అస్పష్టంగా ఉందని చెప్పారు.
ఇలాంటి ప్రతిష్టాత్మక కేసు దర్యాప్తు విషయంలో వర్చువల్ నేరాలను కొనసాగించాలా..? వద్దా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కేసుపై యూకే హోం సెక్రటరీ జెమ్స్ క్లివర్లీ మాట్లాడుతూ.. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్లిందని చెప్పాడు. అయితే హారిజోన్ వరల్డ్‌లో వర్చువల్ సెక్స్ నేరాలపై అనేక నివేదికలు వచ్చాయి. ఇది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే, మా ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని, మా వినియోగదారులకు ఆటోమెటిక్ రక్షణ ఉంటుందని, అపరిచిత వ్యక్తుల్ని దూరంగా ఉంటచుతుందని మెటా ప్రతినిధి చెప్పారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?