CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ‘హిందూ వ్యతిరేకి’ అంటూ అక్కడి బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కర్ణాటక బీజేపీ యూనిట్ సీఎం సిద్ధరామయ్య గుడిలోకి వెళ్లేందుకు నిరాకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతర మంత్రులు, పూజారి లోపలకి ఆహ్వానించినప్పటికీ సీఎం గుడి ప్రవేశద్వారం వద్ద నిలబడి ఉన్న వీడియోని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
Moblie Blast: బైకు పైన వెళ్తున్న యువకుడి జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన బెంగళూర్ లోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంతో బుధవారం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ప్రసాద్‌గా గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ బుధవారం బైక్‌పై వెళ్తూ తన మొబైల్‌ని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ సమయంలో మొబైల్ ఒక్కసారిగా పేలింది. పేలుడు వల్ల నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైట్ ఫీల్డ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన కేసుల జనవరి 11, 12న విచారిస్తామని కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. జెనోసైడ్ కన్వెన్షన్ కింద ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, గాజా ప్రజలపై మారణహోమానికి పాల్పడుతోందని, ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతోందని దక్షిణాఫ్రికా గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
Fuel Prices: గత కొంత కాలంగా కేంద్రం పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గిస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిన్నింటిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతమైతే ట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రతిపాదన లేదని ప్రభుత్వం బుధవారం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో అస్థిరత ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రస్తుతం కేంద్రానికి అలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఇంధన ధరల తగ్గింపుపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొట్టిపారేశారు. ఇంధన లభ్యత ప్రభుత్వ…
NCP: శ్రీ రాముడిని ఉద్దేశించి ఎన్సీపీ(శరద్ పవార్) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. నాసిక్‌లోని షిర్డీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జితేంద్ర అవద్ చేసిన కామెంట్స్‌పై బీజేపీ ఫైర్ అవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరి ప్రతిష్టాపన కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు అవద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని ప్రేరేపించాయి.
Icon of the Seas: మెగా క్రూయిజ్ షిప్, ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. రాయల్ కరేబియన్స్ షిప్స్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఈ నెల 27న తన ప్రారంభ యాత్రను మొదలుపెట్టనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరు తెచ్చుకుంది. అంతకుముందు రాయల్ కరేబియన్ ‘వండర్ ఆఫ్ ది సీస్’ అతిపెద్ద నౌకగా ఉండగా.. ఇప్పుడు ఆ ఖ్యాతిని ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ దక్కించుకుంది.
Ayodhya Ram temple: అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు మాత్రం రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై బాంబుదాడులు చేస్తామని బెదిరించారు.
Divya Pahuja: గురుగ్రామ్ హోటల్లో మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ దివ్య పహుజా హత్యకు గురైంది. హోటల్ యజమాని, అతని సహచరులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఉదంతం, నిందితులు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. బీఎమ్‌డబ్ల్యూ కారులో మృతదేహాన్ని తీసుకెల్లి గుర్తు తెలియని ప్రదేశంలో పడేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు. దివ్యపహుజా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ […]
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈడీ సమన్లను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై అధికారులు సోదాలు జరిపి ఉదయం అరెస్ట్ చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ట్వీ్ట్స్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆప్ నేతలు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేజ్రీవాల్‌ని ప్రశ్నించేందుకు ఈడీ అనేక సార్లు పిలిచింది.
Iran Blasts: ఇరాన్ రివల్యూషనరీ జనరల్ ఖాసిం సులేమాని మరణించి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల వల్ల 95 మంది చనిపోయారు. అయితే ఈ పేలుళ్లకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ బుధవారం నిందించింది. గాజా యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఇరాన్ దాడిలో తమ ప్రమేయం లేని అమెరికా చెప్పింది. ఇదిలా ఉంటే ఈ దాడిపై ఇజ్రాయిల్ స్పందించలేదు.