Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది. ట్రకర్ల నిరసన నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యన్ చేసిన ‘ఔకత్’ (స్థాయి) వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ట్రక్కర్ల ప్రతినిధిని ఉద్దేశిస్తూ ‘నీ స్థాయి ఎంత’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. కలెక్టర్‌ని పదవి నుంచి తొలగించింది బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదని సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
Israel: హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్ కదులుతోంది. తాజాగా హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్-అరౌరీని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చంపేసింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉన్న అల్-అరౌరీపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు ఈ దాడిని లెబనాన్ ప్రధాని ఖండించారు. మరోవైపు ఇతని మరణానికి హమాస్‌తో పాటు హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాయి.
Wrestlers Protest: వందలాది మంది జూనియర్ రెజ్లర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. తమ కెరీర్లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయామని రెజ్లర్లు నిరసనకు పిలుపునిచ్చారు. అయితే ఈ సారి మాత్రం వారంతా ప్రముఖ రెజ్లర్లు అయిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లకు వ్యతిరేకంగా గళం విప్పారు. వారికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో రెజ్లింగ్ సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది.
Car Sales: భారతీయులు కార్లను తెగ కొనేస్తున్నారు. 2023 కార్ల అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. దేశంలో తొలిసారిగా గతేడాది 40 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వెహికిల్స్(పీవీ)అమ్ముడయ్యాయి. ఈ మార్క్‌ని చేరుకోవడం భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే తొలిసారి. పాసింజర్ వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే.. 2022(కాలెండర్ ఇయర్) 37,92,000 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2023( కాలెండర్ ఇయర్)లో 41,08,000 పాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏకంగా 8.33 శాతం విక్రయం పెరిగింది.
కూటమిలో ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నిన్న నితీష్ కుమార్ శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ని ఈ పదవికి ఎంచుకునే ఆలోచనను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.
Man Chops Nose: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తోటలో పిల్లలు పూలు కోసినందుకు ఓ వ్యక్తి మహిళ ముక్కు కోశాడు. ఈ ఘటన బెలగావిలోని బసుర్తే గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నిందితుడు కళ్యాణి మోరే, అంగన్ వాడీ కార్యకర్త సుగంధ మోరే(50)తో గొడవపడి, ఆమె ముక్కును నరికాడు.
సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సత్యం గెలిచింది. గౌరవ సుప్రీంకోర్టు మరోసారి నిరూపించింది. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడిని. భారతదేశ వృద్ధిలో మా సహకారం కొనసాగుతుంది. జైహింద్’’ అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం కోసం ఇప్పటికే రూల్స్ రెడీ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే సీసీఏ కోసం నిబంధనలు జారీ చేయబోతున్నామని, నిబంధనల జారీ తర్వాత చట్టం అమలు చేయబడుతుందని, అర్హులైన వారికి భారత పౌరసత్వం మంజూరు చేయబడుతుందని విషయం తెలిసిన ఓ అధికారి తెలిపారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మూడోసారి కూడా సమన్లను దాటవేశాడు. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కేవలం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే లక్ష్యమని ఆప్ ఆరోపించింది.