BJP: ప్రజలకు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ‘ఉచితాలు’ ఇవ్వడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారే అవకాశం ఉందని చెబుతోంది. ఉచితాలు కాకుండా ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తోంది. గతేడాది కర్ణాటక ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఉచితాల రాష్ట్రాలు అప్పులపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: UK: 16 ఏళ్ల బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు..
ఇదిలా ఉంటే..2018-23 మధ్య దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సబ్సిడీల పెరుగుదల విపక్షరాష్ట్రాల కన్నా ధీటుగా ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో తెలిపింది. ఈ ఐదేళ్లలో రాష్ట్రాలు సమర్పించిన బడ్జెట్‌ని పరిశీలించి ఆర్బీఐ ఈ నివేదికను రూపొందించింది. 2029-24 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా కేటాయించిన సబ్సిడీల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల వాటా 34 శాతం ఉండగా.. ఆప్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సబ్సిడీ వాటా 20 శాతం ఉంది.
గుజరాత్ రాష్ట్రంలో 2018-19 నాటికి రూ. 17 వేల కోట్లు ఉన్న సబ్సిడీ 2023 నాటికి రూ. 30 వేల కోట్లకు చేరుకుందని, హర్యానాలో రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 11 వేల కోట్లకు, కర్ణాటకలో రూ. 23 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు, యూపీలో రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 26 వేల కోట్లకు, మధ్యప్రదేశ్ లో రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్లకు సబ్సిడీలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా గత మూడేళ్లుగా సబ్సిడీలను పెంచుతూనే ఉంది. 2018-19లో బడ్జెట్ లో కేంద్రం రూ. 2.92 లక్షల కోట్లను సబ్సిడీలకు కేటాయిస్తే.. 2019-20లో రూ. 2.95 లక్షలకు పెంచింది.