Parking: పార్కింగ్ కోసం గొడవ.. కార్లుతో ఈడ్చుకెళ్లి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parking: ఇటీవల కాలంలో పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు భౌతికదాడుల వరకు వెళ్తున్నాయి. తాజాగా న్యూ ఇయర్ రోజు పార్కింగ్ వాగ్వాదం ఒకరి మరణానికి కారణమైంది. ఘజియాబాద్‌లోని మోడీ నగర్‌లో పార్కింగ్ వివాదంతో కోపం పెంచుకున్న ఓ వ్యక్తి తన ఎస్‌యూవీ కార్‌తో 30 ఏళ్ల వ్యక్తిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు అతని నలుగురు సహచరులు మద్యం సేవించి ఉన్నారని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు డీసీసీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 31న జనసేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న అనుపమ్ శ్రీవాస్తవ తన స్నేహితుడి అరుణ్‌తో కలిసి మోడీనగర్ లోని హర్ముఖ్ పూరి మార్కెట్‌లో స్నాక్స్ తీసుకునేందుకు వెళ్లారు.
Also Read
Read Also: Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి, 25 మందికి గాయాలు..
శ్రీవాస్తవ కారుని ఒక ప్రాంతంలో పార్క్ చేశారు, అరుణ్ కారులోనే ఉన్నాడు. వీరి కారు ముందు నిందితుడు రాహుల్ చౌదరి ఎస్‌యూవీ ఆగి ఉంది. అయితే అరుణ్ తమ కారు ముందు ఉన్న ఎస్‌యూవీ తీయాలని హారన్ కొట్టాడు. రాహుల్ చౌదరి మద్యం మత్తులో కోపంతో ఊగిపోతూ, శ్రీవాస్తవను తిట్టాడు. స్థానికులు జోక్యంతో అక్కడితో గొడవ సద్దుమణిగింది.
చౌదరి అక్కడి నుంచి వెళ్లిపోయి, తన స్నేహితులతో కలిసి వచ్చి శ్రీవాస్తవపై దాడికి పాల్పడ్డాడు. తన ఎస్‌యూవీ కారుతో శ్రీవాస్తవను 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. తీవ్రగాయాలపాలైన అతను ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి చనిపోయాడు. నిందితుడి స్నేహితులు, శ్రీవాస్తవను చంపేయాలని నిందితుడు చౌదరిని రెచ్చగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యానేరాన్ని నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!