Ayodhya Ram temple: అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు మాత్రం రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై బాంబుదాడులు చేస్తామని బెదిరించారు.
Read Also: Divya Pahuja: గ్యాంగ్‌స్టర్ మాజీ ప్రియురాలు దివ్య పహుజా మర్డర్.. సీసీటీవీలో హంతకులు..
ఈ బెదిరింపులపై విచారణ ప్రారంభించిన యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. లక్నోలోని గోమతినగర్‌కి చెందిన తాహర్ సింగ్, ఓం ప్రకాష్ మిశ్రాలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులిద్దరూ ఎక్స్ హ్యాండిల్ ఉపయోగించి ఆదిత్యనాథ్‌తో పాటు ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్‌లను బెదిరించడమే కాకుండా రామమందిరాన్ని పేల్చేస్తానమని హెచ్చరించారు. ప్రాథమిక విచారణలో వీరికి ఈ రెండు ఈమెయిల్ ఐడీలు ఉన్నాయని, వీటిని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులిద్దరూ కూడా పారామెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారని ప్రకటన తెలిపింది. ఈ విషయాన్ని ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది.