సాధారణంగా సౌర తుఫానుల నుంచి వెలువడే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వీటిని ముందుగానే ఆదిత్య-ఎల్1 గుర్తిస్తుంది. దీని వల్ల శాటిలైట్లను రక్షించుకోవచ్చు.
China Praises Modi: ప్రధాని నరేంద్రమోడీపై చైనా ప్రశంసలు కురిపించింది. మోడీ హయాంలో భారత్ ఆర్థిక, సామాజిక పాలన, విదేశాంగ విధానాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని చైనీస్ స్టేట్ మీడియా ఏజెన్సీ గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. అభివృద్ధి చెందడంలో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని తన ఆర్టికల్‌లో వ్యాఖ్యానించింది. షాంఘైలోని ఫుడాన్ యూనివర్శిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసిన కథనాన్ని ప్రముఖ ప్రభుత్వ-చైనీస్ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. గత నాలుగేళ్లలో భారత్ సాధించిన అద్భుత…
Javed Ahmed Mattoo: హిజ్బుల్ ముజాహిదీన్‌కి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీం మట్టూను అరెస్ట్ చేసింది. ఇతను జమ్మూకాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రసంస్థ తరుపున పనిచేస్తున్నాడు. పోలీసులు మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్‌లు, దొంగలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు.
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం విషాదాన్ని నింపింది. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని అనుకున్న అక్కడి ప్రజలకు కన్నీటిని మిగిల్చింది. దేశంలోని వాయువ్య ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. కేవలం ఒకే రోజులో 150కి పైగా భూకంపాలు జపాన్ దేశాన్ని తాకాయి.
Hyundai Creta facelift: భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ మేకర్‌గా ఉన్న హ్యుందాయ్ నుంచి కొత్తగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ విభాగంలో మార్కెట్ టాప్ ప్లేస్‌లో ఉన్న క్రేటా న్యూ అవతార్‌లో రాబోతోంది. జవవరి 16న లాంచ్ చేసేందకు హ్యుందాయ్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ కోసం రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్‌ని ప్రారంభించింది. గతేడాది 2023లో క్రేటా మంచి అమ్మకాలను నమోదు చేసింది. 1,57,311 […]
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
Covid Cases In India: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిని ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని, తనను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా…
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలపై విమర్శనాత్మకంగా స్పందించారు. చైనాతో భారత సంబంధాల విషయంలో మాట్లాడుతూ ఆయన చరిత్రలో జరిగిన అంశాలను గుర్తు చేశారు. ఢిల్లీలో ‘వై భారత్ మాటర్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. చైనా, పాకిస్తాన్, అమెరికా సంబంధాలను గురించి మాట్లాడారు.
Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.