Mohalla Clinics: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు ఎదురైంది. ఆప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌ల పనితీరులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్‌లలో జరిగి రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కేంద్రం కోరినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టబోతున్న ‘భారత్ న్యాయ యాత్ర’పై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఓట్లను తీసుకురాదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన కుమారుడని, ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా జనాలు ఆయన్ని హీరోగా చూస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. అస్సాంలోని బార్పేట జిల్లాలోని బగ్మారా చార్ ప్రాంతంలో జరిగిన బహిరంగ…
Sam Altman: ఒపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో ముస్లిం, అరబ్ కమ్యూనిటీ సభ్యులు ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారని ఆయన గురువారం అన్నారు.
Pregnancy termination: భర్త మరణంతో ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న భార్య, తన 27 గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. మానసిక పరిస్థితికి సంబంధించిన రిపోర్టును పిటిషనర్ కోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ గర్భ విచ్ఛత్తికి అనుమతించారు. ‘‘పిటిషనర్ వివాహ స్థితిలో మార్పు ఉంది. ఆమె వితంతువు అయింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Kim Jong Un: వరస మిస్సైల్ టెస్టులు, గూఢాచర ఉపగ్రహాల ప్రయోగంతో కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు. జపాన్, దక్షిణకొరియా, యూఎస్ వార్నింగులను ఖాతరు చేయడం లేదు ఉత్తర కొరియా నియంత. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మిస్సైల్ లాంచర్ల ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.
California: ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్న వీరు, మరోసారి ఇలాంటి ఘటనకే పాల్పడ్డారు. అమెరికా కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయాన్ని గ్రాఫిటీ పెయింట్స్‌తో ధ్ద్వంసం చేశారు. ఇదే ప్రాంతంలో కొన్ని వారాల క్రితం స్వామినారాయణ మందిరంపై కూడా ఇలాగే దాడికి తెగబడ్డారు. తాజాగా మరోసారి హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారు.
Japan Earthquake: జపాన్ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 92 మరణించారు. మరో 242 మంది మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ మొదటి రోజునే భారీ భూకంపం జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసింది. జనవరి 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Ram Mandir: అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవనానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 22న శ్రీరామమందిర ప్రతిష్టాపన జరగనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7000 మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపబడుతున్నాయి. ఈ ఆహ్వాన పత్రికలను కూడా స్పెషల్‌గా డిజైన్ చేశారు. ప్రతీ ఆహ్వన పత్రికపై శ్రీరాముడి చిత్రంతో పాటు రామమందిర ఉద్యమానికి సంబంధించి ముఖ్య సంఘటనలకు సంబంధించిన వివరాలతో కూడిన బుక్ లెట్ ఉంది. ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న వారి వివరాలు ఉన్నాయి.
Islamic State: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ చీఫ్ ఖాసిం సులేమానీ స్మారకార్థం, ఆయన హత్యకు గురై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా.. ఇరాన్ లోని కెర్మాన్‌లో శ్రద్ధాంజలి ఘటించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన రెండు భారీ బాంబు పేలుళ్లలో 103 మంది మరణించారు. అయితే ఈ దాడి తమ పనే అని ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించింది. టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.