Moto X70 Air Pro: మోటరోలా త్వరలో Moto X70 Air Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే స్లిమ్ డిజైన్, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లను మోటరోలా టీజ్ చేసింది. ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్‌లో భారత్ సహా మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా Motorola Edge 70 Ultra పేరుతో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
Lyricist Chandrabose : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందనుకోలేదు: చంద్రబోస్
లిస్టింగ్ (XT2603-1 మోడల్ నంబర్) ప్రకారం Moto X70 Air Proలో 6.78 అంగుళాల 1.5K (1264 × 2780 పిక్సెల్స్) OLED డిస్‌ప్లే ఉండనుంది. ఈ ఫోన్‌లో గరిష్టంగా 3.8GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండటం గమనార్హం. దీన్ని బట్టి ఇందులో Qualcomm Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ఉండొచ్చని అంచనా. లిస్టింగ్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో Adreno 829 GPU, అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా వచ్చే అవకాశముంది.
Moto X70 Air Proను 8GB, 12GB, 16GB RAM వేరియంట్లలో విడుదల చేయవచ్చు. స్టోరేజ్ పరంగా 256GB, 512GB, అలాగే గరిష్టంగా 1TB వరకు ఆప్షన్లు ఉండొచ్చని సూచిస్తోంది. అయితే ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు మద్దతు ఉండకపోవచ్చు. ఫోటోగ్రఫీ విభాగంలో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వెనుక భాగంలో మూడు 50MP కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 3x ఆప్టికల్ జూమ్‌కు మద్దతిచ్చే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండనుంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ డివైస్‌లో AI ఆధారిత ఇమేజింగ్ ఫీచర్లు కూడా ఉంటాయని మోటరోలా ఇప్పటికే టీజ్ చేసింది.
Lyricist Chandrabose: ఎన్నో అవమానాలను భరించాను.. ఆ తర్వాతే సన్మానాలు: చంద్రబోస్
ఈరాబోయే స్మార్ట్ ఫోన్ లో 5,100mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాదు ఈ ఫోన్ 3C సర్టిఫికేషన్‌లో 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌కు మద్దతుతో కనిపించింది. అలాగే వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశముంది. బ్లూటూత్, USB కనెక్టివిటీతో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వనున్నారు. గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్ వంటి ఇతర సెన్సార్లు కూడా ఇందులో ఉంటాయి.