China-Taiwan Conflict: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి అయిన లై చింగ్-తే అధ్యక్షుడిగా విజయం సాధించడం డ్రాగన్ కంట్రీకి మింగుడుపడటం లేదు. లీ చింగ్-తే గెలిచినప్పటి నుంచి తైవాన్‌ని బెదిరించేందుకు చైనా ప్రకటనలు చేస్తోంది. చైనా హెచ్చరికలను ధిక్కరిస్తూ.. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీవ్రంగా శిక్షించబడుతుందని చైనా విదేశాంగ మంత్రి ఆదివారం హెచ్చరించారు.
Milind Deora: 55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న బంధాన్ని మిలింద్ దేవరా వదిలేశారు. మహారాష్ట్రలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఈ రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉన్నందుకు శివసేనలో చేరినట్లు వెల్లడించారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం తగిన సంఖ్యకు దూరంగా ఉంటుందని, ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరోధించవచ్చని అన్నారు.
Congress: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2019 నుంచి ఆ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో కీలక నేత, కాంగ్రెస్‌తో 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న కుటుంబంలోని సీనియర్ నేత మిలింద్ దేవరా కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మొదలుపెట్టే రోజు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
Ram Mandir: అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా, సినీ, వ్యాపారవేత్తలు, సాధువులకు రామమందిర ట్రస్ట్ ఆహ్వానాలనున పంపింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు అరుదైన వ్యక్తి ఆహ్వానం అందింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ సంతోషి దుర్గకు రామాలయ ట్రస్ట్ ఆహ్వానం పంపింది.
Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.
Atal Setu: దేశంలో అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL)గా పిలువబడుతున్న ఈ వంతెను ముంబై వాసులకు దూరాభారాన్ని తగ్గిస్తుంది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు.
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవ్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనిక ఉనికిని ఉపసంహరించుకోవాలని భారత్‌ని కోరింది. ఇండియా వ్యతిరేక ధోరణితో పదవికి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ, ద్వీపదేశంలోని భారత సైనికులు విడిచివెళ్లాలని కోరుతున్నాడు.
Travel Company: బస్సు ప్రయాణంలో తనను గమ్యస్థానానికి చేర్చకుండా ఇబ్బందులకు గురి చేసిన ట్రావెల్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించారు. బాధితుడైన ముంబై వాసికి టికెట్ డబ్బులతో పాటు రూ. 2 లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. ట్రావెల్ పోర్టర్, బస్ సర్వీస్ రూట్ మార్పు గురించి ఫిర్యాదుదారుడికి ముందుగానే తెలియజేయాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. టిక్కెట్ ధర రూ. 745తో పాటు 2 లక్షలు 69 ఏళ్ల వ్యక్తికి చెల్లించాలని ఆదేశాలు జారీ…
Ram Mandir Inauguration: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న అట్టహాసంగా జరగబోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే యూపీలో యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు దేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులు అతిథులుగా వెళ్తున్నారు. మొత్తం 7 వేల మంది వరకు అతిథులతో పాటు లక్షల మంది ప్రజలు…