Ram Mandir Inauguration: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న అట్టహాసంగా జరగబోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే యూపీలో యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు దేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులు అతిథులుగా వెళ్తున్నారు. మొత్తం 7 వేల మంది వరకు అతిథులతో పాటు లక్షల మంది ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమానికి హాజరవనున్నారు.
ఇదిలా ఉంటే ఒక్క మనదేశం నుంచే కాకుండా ప్రపంచంలోని 55 దేశాలకు చెందిన 100 మంది ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. విదేశాల రాయబారులు, ఏంపీలు ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరవుతున్నారని ప్రపంచ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ ఈ రోజు చెప్పారు. VVIP విదేశీ ప్రతినిధులందరూ జనవరి 20న లక్నోకు చేరుకుంటారు, ఆ తర్వాత జనవరి 21వ తేదీ సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటారన్నారు. మరికొంత మంది విదేశీ అతిథులను ఆహ్వానించాలని అనుకున్నప్పటికీ.. స్థలం తక్కువగ ఉండటంతో అతిథుల జాబితాను తగ్గించాల్సి వచ్చిందన్నారు.
Read Also: India’s first bullet train: 2026లో ఇండియాలో తొలి బుల్లెట్ ట్రైన్..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22న మధ్యాహ్నానానికి రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. జనవరి 16 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణప్రతిష్ట వేడకకు 11 రోజుల ముందు ప్రత్యేక అనుష్టాన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు.
ఆహ్వానించిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్, బోట్స్వానా, కెనడా, కొలంబియా, డెన్మార్క్, డొమినికా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఈజిప్ట్, ఇథియోపియా, ఫిజి, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, గయానా, హాంగ్ ఉన్నాయి కాంగ్, హంగరీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, జమైకా, జపాన్, కెన్యా, కొరియా, మలేషియా, మలావి, మారిషస్, మెక్సికో, మయన్మార్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, నార్వే, సియెర్రా లియోన్, సింగపూర్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక , సురినామ్, స్వీడన్, తైవాన్, టాంజానియా, థాయిలాండ్, ట్రినిడాడ్ & టొబాగో, వెస్టిండీస్, ఉగాండా, UK, USA, వియత్నాం మరియు జాంబియా ఉన్నాయి.