Bat Virus: గబ్బిలాల్లో ప్రాణాంతక వైరస్‌ని పరిశోధనా బృందం థాయ్‌లాండ్‌లో కనుగొంది. గతంలో కరోనా వైరస్‌తో ముడిపడి ఉన్న ఎకోహెల్త్ అలయన్స్ పరిశోధకులే ఈ డెడ్లీ బ్యాట్ వైరస్‌ని కనుగొన్నారు. ఈ సంస్థ చీఫ్ డాక్టర్ పీటర్ దస్జాక్ కోవిడ్ లాగే మానవులకు సోకే అవకాశం ఉన్న వైరస్‌ని కనుగొన్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. గతంలో ఈ పరిశోధర బృందానికి చైనా వూహాన్ వివాదాస్పద ప్రయోగశాలతో సంబంధం ఉంది. థాయ్‌లాండ్ లోని ఓ గుహలోని గబ్బిలాల్లో ఈ వైరస్ కనుగొనబడింది. ఇప్పటికే పరిశోధకులు కనుగొన్న…
Himanta Biswa Sarma: రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ వేడకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. దేశంలోని వివిధ రంగాల్లో ప్రముఖులు 7000 మంది అతిథులుగా రాబోతున్నారు. ఇప్పటికే అయోధ్య నగరం ఈ వేడుక కోసం ముస్తాబైంది. యూపీతో పాటు దేశమంతట పండగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలను ఆహ్మానించినప్పటికీ తాము రాబోవడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.…
Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హర్యానాలోని ఓ హోటల్ గదిలో ఆమెను హత్య చేసి, డెడ్‌బాడీని ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నిందితులు డెడ్‌బాడీని ఎక్కడ పారేశారనే విషయంపై పోలసీులు గత కొన్ని వారాలుగా వెతుకుతున్నారు. చివరకు ఓ కాలువలో కుళ్లిపోయిన స్థితితో దివ్యపహుజా మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసిన తర్వాత పొరుగున ఉన్న పంజాబ్‌లోని కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
POK: పాకిస్తాన్లో బ్రిటన్ రాయబారిగా ఉన్న జేన్ మారియట్ ఇటీవల పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో పర్యటించడం వివాదాస్పదమైంది. పాకిస్థాన్‌లోని UK హైకమిషనర్ జేన్ మారియట్ జనవరి 10న మీర్పూర్ను సందర్శించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె పర్యటన ‘‘అత్యంత అభ్యంతరకరం.. భారత సార్వభౌమాధికారం,
Stray Dogs Attack: విధికుక్కులు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలో ఏడు నెలల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణం తీశాయి. ఈ ఘటన బుధవారం నగరంలోని అయోధ్య నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పోలీసులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
NRI Spouses: ఇటీవల కాలంలో తల్లిదండ్రులకు వారి అమ్మాయిలను అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ఫారన్ కంట్రీల్లో ఉంటున్న అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కట్నం ఎంతైనా కానీ మాకు ఎన్ఆర్ఐ అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. ఇక అమ్మాయిలు కూడా తాము కూడా విదేశాల్లో సెటిల్ కావడానికే మొగ్గు చూపుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు, మరో వైపు ఇలా ఎన్ఆర్ఐల్లో కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత భారతీయ మహిళల్ని విడిచిపెడుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగాయి.
ఇదిలా ఉంటే దేశంలోనే అత్యంత మురికి నగరంగా పశ్చిమబెంగాల్ లోని హౌరా నగరం నిలిచింది. లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న 10 మురికి నగరాలు పశ్చిమబెంగాల్ లోనే ఉన్నాయి.
Bombay High Court: 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టైన మహారాష్ట్ర వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక సంబంధం ప్రేమ వ్యవహారంతో జరిగిందని, అది కామం వల్ల కాదని కోర్టు అభిప్రాయపడింది. బాలిక మైనర్ అని.. అయితే ఆమె తన ఇష్టంతోనే ఇంటిని వదిలేసి నిందితుడు నితిన్ ధబేరావ్తో కలిసి వెళ్లిందని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పినట్లు జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే గమనించారు.
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం భారతదేశం ముస్తాబవుతోంది. ముఖ్యంగా అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
LK Advani: అయోధ్యంలో రామాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ కూడా ఆహ్వానించారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ సోమనాథ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర డిసెంబర్ 6, 1992న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేవరకు అద్వానీ రథయాత్ర సాగింది. ఒక విధంగా చెప్పాలంటే రామాలయ నిర్మాణంలో అద్వానీది ప్రముఖమైన పాత్ర. ఆయన రథయాత్రతోనే రామమందిర నిర్మాణం అనేది జనాల్లో నాటుకుపోయింది. అద్వానీతో పాటు మరో సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషిలు 1990లో…