India's first bullet train: భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ కారిడార్‌ని రూ. 1.08 లక్షల కోట్లతో నిర్మిస్తోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్) ఈ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 270 కిలోమీటర్ల గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తైందని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. 270 కి.మీ పొడవునా వైర్ డక్ట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్ణీత కాలక్రమం ప్రకారం ప్రాజెక్ట్…
Milind Deora: కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవరా ఆ పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. దీనిపై సీఎం షిండే స్పందించారు. మిలింద్ దేవరా శివసేనలో చేరానుకుంటే అతడిని స్వాగతిస్తామని అన్నారు.
Housing Crisis: కెనడాలో హౌసింగ్ క్రైసిస్ తీవ్రమవుతోంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క తెగ ఇబ్బందుల పడుతున్నారు. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ సంక్షోభంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. అయితే ఎంతమేర పరిమితి విధిస్తారనే వివరాలను మంత్రి పేర్కొనలేదు.
China: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాకు వ్యతిరేకిగా పేరొందిన లై చింగ్-తే గెలుపొందడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా తైవాన్ జనాలు పట్టించుకోలేదు. వరసగా మూడోసారి అధికార పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఇదిలా ఉంటే ఓటింగ్ ఫలితాలు, తైవాన్ పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) తైవాన్ లోని ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని, తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి చెన్ జిన్హూవా వార్త సంస్థకు చెప్పారు.
Operation Sarvashakti: జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. లోయలో మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇటీవల పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. పిర్ పంజాల్ పర్వతాలను, అక్కడి అడవుల్లో దాక్కుంటూ భద్రతా సిబ్బందికి సవాల్ విసురుతున్నారు. ఈ ప్రాంతంలోని గుహలు, కొండలు, అడవులు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారడంతో వారిని ఏరేసేందుకు చేస్తున్న ఆపరేషన్లు కష్టంగా మారాయి. ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో అధికారులతో సహా జవాన్లు 20 మంది మరణించారు. డిసెంబర్ 21న నలుగురు సైనికులను…
Seema Haider: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు కూడా వస్తున్నారు. వీరితో పాటు లక్షలాది మందితో అయోధ్య నగరం నిండిపోనుంది. రామభక్తులు ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది.
Nipah vaccine: ప్రాణాంతక నిపా వైరస్ నుంచి మానవులను కాపాడేందుకు వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే తొలి నిపా వ్యాక్సిన్ మానవ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ విధానంలో ఆస్ట్రాజెనెకా (AZN.L) మరియు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉపయోగించిన అదే సాంకేతికత ఆధారంగా ఈ వ్యాక్సిన్ రూపొందిస్తు్న్నారు. నిపా వైరస్ కోసం తయారు చేయబడిన ChAdOx1 NiV అని పిలిచే ఈ వ్యాక్సిన్ ప్రిలినికల్ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత, హ్యూమన్ టెస్టింగ్ దశలోకి ప్రవేశించింది.
Taiwan: ప్రపంచ వ్యాప్తంగా తైవాన్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తిని పెంచాయి. చైనా, తైవాన్‌ని సొంతం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్న వేళ, చైనాకు ట్రబుల్ మేకర్‌గా పేరుపొందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) నేత లై చింగ్-తే విజయం సాధించారు. వరసగా మూడో సారి అక్కడి ప్రజలు ఈ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపుతో చైనాకు గట్టి దెబ్బతాకినట్లు అయింది. ఎన్నికల సమయంలో లై చింగ్ని చైనా ప్రమాదకరమైన వేర్పాటువాదిగా నిందించింది.
S Jaishankar: న్యూఢిల్లీలో సంప్రదింపులు లేకుండా ప్రస్తుతం ప్రపంచం ఏ సమస్యపై నిర్ణయం తీసుకోలేదని, భారత్ ప్రపంచంలో చాలా కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ మారిందని, ప్రపంచం మనల్ని చూసే దృష్టి కూడా మారిందని ఆయన శనివారం అన్నారు. భారత్ స్వతంత్రంగా ఉండటమే దీనికి కారణమని.. భారత్ వేరొకరి సంస్థలా కాకుండా, తన ప్రయోజనాల కోసం పరస్పరం విభిన్న దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.
Maldives Row: భారత్-మాల్దీవుల వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఐదు రోజుల పర్యటన ముగించుకుని సొంతదేశానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదని, మమ్మల్ని వేధించే లైసెన్స్ మీకు ఇవ్వబడలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.