Atal Setu: దేశంలో అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL)గా పిలువబడుతున్న ఈ వంతెను ముంబై వాసులకు దూరాభారాన్ని తగ్గిస్తుంది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. 21.8 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి.. సముద్రంపై 16.5 కిలోమీటర్లు ఉండగా, భూమిపై 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వంతెన వల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య సమయం 15-20 నిమిషాలకు తగ్గుతుంది. ముంబై నుండి పూణే, గోవా మరియు దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. 2016 డిసెంబర్‌లో ఈ బ్రిడ్జికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వంతెన భద్రత కోసం 400 సీసీటీవీలను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణ వ్యయం రూ. 12,700 కోట్లు.
Read Also: Delhi: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు.. ఆలస్యంగా నడిచిన విమానాలు, రైళ్లు..
ఇదిలా ఉంటే ప్రారంభించి రెండు రోజుల కాకముందే వంతెనపై కొందరు గుట్కాలను ఉమ్మేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వంతెనను పిక్నిక్ స్పాట్‌గా మారుస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రాఫిల్ ఉల్లంఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు తమ కార్లను వంతెనపై నిలిపి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటూ.. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. నెటిజన్లు ప్రజల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..‘‘ డబ్బుతో కార్లు, పెట్రోల్, టోల్ ఫీజులు కొనొచ్చు.. కానీ డబ్బుతో ఇంగితజ్ఞానాన్ని కొనుగోలు చేయలేము’’ అంటూ మండిపడుతున్నారు.
Spotted the First few Pan Gutkha Stains on #MTHL#AtalSetu#BoloZubanKesari pic.twitter.com/M0jdBKzUUa
— मुंबई Matters™🇮🇳 (@mumbaimatterz) January 13, 2024
Money can buy cars, fuel and toll fees.
Money can't buy common sense 😔#MTHL #AtalSetu
— Roads of Mumbai (@RoadsOfMumbai) January 13, 2024