Ayodhya: హనుమంతుడి జన్మస్థలం కర్ణాటక హంపీ ప్రాంతంలో ఉన్న కిష్కింధ నుంచి శ్రీరాముడి కోసం ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే అయోధ్యకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల మీదుగా రథం అయోధ్యకు చేరుకునే ముందు సీతా దేవీ జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ వెళ్లింది. 100 మంది భక్తుల బృందం “జై శ్రీ రామ్” నినాదాలు చేస్తూ రథం వెంట నడిచారు. మూడేళ్ల క్రితం ఈ యాత్ర ప్రారంభమైంది.
Read Also: Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత “మిస్ వరల్డ్” పోటీలకు భారత్ ఆతిథ్యం..
గత రెండు నెలల్లో అనేక ప్రాంతాల గుండా రథం ప్రయాణించింది. అయోధ్యంలోని సరయు నది ఒడ్డున రథాన్ని నిలిపి ఉంచారు. దీంతో రథాన్ని దర్శించేందుకు పర్యాటకులు, భక్తులు ఆసక్తి చూపించారు. హంపికి చెందిన హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా వచ్చే ఆరేళ్లలో కిష్కింధలో రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో 215 మీటర్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించాలని యోచిస్తోంది. రూ. 40 లక్షల వ్యయంతో ఈ రథాన్ని నిర్మించారు. ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవీ, హనుమాన్, హంపి విరూపాక్షుడు, హనుమాన్ తల్లి అంజనీ విగ్రహాలు ఉన్నాయి. కిష్కింధ నుండి భక్తులు ప్రతి సంవత్సరం దేవ్ దీపావళికి అయోధ్యను సందర్శిస్తారు.