Putin Praises PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. నేటి ప్రపంచంలో అంత సులభం కాని ‘స్వతంత్ర’ విదేశాంగ విధానాన్ని అనుసరించడం భారత్‌కే చెల్లిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రష్యా మీడియా నెట్వర్క్ రష్యా టుడే వెల్లడించింది. గురువారం ‘రష్యన్ స్టూడెంట్ డే’ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు.
India on Pak: గతేడాది పాకిస్తాన్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అయితే ఈ హత్యల్లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఆరోపించారు. అయితే, పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండగించింది. పాక్ ఆరోపణలు భారత వ్యతిరేక ప్రచారాన్ని పెంపొందించడానికి తాజా ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Gyanvapi Case: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) నివేదిక సూచిస్తోందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు. మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వసం చేసినట్లు నివేదిక సూచిస్తోందని జైన్ అన్నారు.
Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్. గురువారం ఆయన భారతదేశానికి వచ్చారు. రాజస్థాన్ జైపూర్ సిటీని సందర్శించారు. జైపూర్ నగరంలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్రమోడీ, అధ్యక్షుడు మక్రాన్‌కి స్వాగతం పలికారు, ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చిన మక్రాన్ రెండు రోజుల పాటు దేశంలో పర్యటించనున్నారు. తొలిరోజు జైపూర్ సందర్శనతో ఆయన పర్యటన ప్రారంభమైంది.
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని కొనియాడారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థ పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే చాలా పురాతనమైనది. అందుకే భారతదేశాన్ని "
Pakistan: ఇటీవల కాలంలో పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తుల చంపుతున్నారు. అయితే ఈ హత్యల వెనక భారత్ ఉందని పాక్ ప్రభుత్వం అంతర్గతంగా అనుకుంటున్నప్పటికీ.. ఎప్పుడూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అయితే తొలిసారిగా పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్‌లు పాకిస్తాన్ గడ్డపై ఇద్దరు పాకిస్తానీలను హత్యల్లో ప్రయేయం ఉందని ఆరోపించారు.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని గురువారం ఆవిష్కరించింది.
Manoj Kumar Sharma:‘12th ఫెయిల్’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన అత్యుత్తమ చిత్రంగా ఉంది. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. సివిల్స్ సాధించేందుకు ఒక సాధారణ యువకుడు ఎదుర్కొన్న సంఘటనలు ప్రేక్షకులను కట్టిపారేశాయి. ఐపీఎస్ అయ్యేందుకు ఎలాంటి అడ్డుంకులు ఎదుర్కొన్నాడు, అమ్మాయి ప్రేమ ఉన్నత లక్ష్యాన్ని సాధించేందు ఎలా సహకరించిందనే విషయాలను డైరెక్టర్ విధువినోద్ చోప్రా తెరకెక్కించారు. చాలా మంది యువతీయువకులకు తన లక్ష్యాలను సాధించేందుకు ఈ సినిమా ఉత్ప్రేరకంగా నిలిచింది.
INDIA Bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఇండియా కూటమి ముక్కలు అవుతుందా..? ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు, బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కోవాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ లక్ష్యం నెరవేరక ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూటమిని వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఒంటరి పోరనే చెప్పింది.
ఇదిలా ఉంటే జేడీయూ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి చేరుతున్నట్లు, పాత మిత్రుడు బీజేపీకి నితీష్ దగ్గరవుతున్నట్లు గురువారం పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి అశ్విని చౌబే హుటాహుటిన అధిష్టానాన్ని కలిసేందుకు పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.