President Murmu: “భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి”.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ డే సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని కొనియాడారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థ పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే చాలా పురాతనమైనది. అందుకే భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి” అని పిలువడానికి కారణం అని ఆమె అన్నారు. భారతదేశం ప్రస్తుతం అమృత్‌కాత్ ప్రారంభ దశలో ఉందని, భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇది పరివర్తన సమయమని, మన లక్ష్యాలను సాధించడంలో ప్రతీ పౌరుడి సహకారం చాలా కీలమని చెప్పారు.
Read Also: Pakistan: పాకిస్తానీలను చంపింది ఇండియన్ ఏజెంట్లే.. భారత్‌పై పాక్ సంచలన ఆరోపణలు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
రాష్ట్రపతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి రాష్ట్రపతి మాట్లాడారు. అమృతకాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అవుతుందని, సాంకేతిక పురోగతి మన దైనందిక జీవితంలో భాగమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఆందోళన కలిగించే అనేక రంగాలు ఉన్నాయని, కానీ ఉత్తేజకరమైన అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా యువత కోసం అవకాశాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు.
వీటితో పాటు జీ20 సమావేశాలు, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, మహిళా సాధికారత గురించి మాట్లాడారు. అయోధ్య రామ మందిర వేడుకను భారతదేశం మొత్తం చూసిందని, మన నాగరికత వారసత్వాతన్ని తిరిగి కనుగొనడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లను పార్లమెంట్ ఆమోదించిందని, దేశం లింగ సమానత్వ ఆదర్శం వైపు మరింతగా పురోగమించిందని ముర్ము అన్నారు. నారీ శక్తివందన్ అధినియం మహిళా సాధికాతరకు విప్లవాత్మక సాధనంగా మారుతుందని చెప్పారు.
ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన జీడీపీ వృద్ధి అత్యధికంగా ఉందని, ఈ పనితీరు 2024లో అంతకుమించి కొనసాగతుందని అన్నారు.
మూన్ మిషన్, సోలార్ ఎక్స్‌ప్లోరర్ ఆదిత్య ఎల్1, ఎక్స్‌పోశాట్ అనే డీప్ స్పేస్ ప్రోబ్ ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్, తయారీ మ్యాన్-మిషన్ గగన్‌యాన్, ఇతర సాంకేతిక మైలురాళ్ల ద్వారా అంతరిక్షంలో భారతదేశం యొక్క అన్వేషణను రాష్ట్రపతి ప్రశంసించారు.
జీ 20 సమ్మిట్ గ్లోబల్ సౌత్ వాయిస్‌గా భారతదేశం మారిందని అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం డిజిటల్ విభజనను తగ్గించడానికి శక్తినిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!