AP High Court: నూజివీడు మండలంలోని మంగో బే రిసార్ట్ & క్లబ్‌లో జరుగుతున్న పేకాట/13 కార్డ్స్ పందాలు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 13 కార్డ్స్ లేదా ఇతర డబ్బుకు సంబంధించిన పందాలకు సంబంధించి ఏ ఆటను కొనసాగించవద్దు అని స్పష్టం చేసింది హైకోర్టు.. ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడుతున్నట్టు పోలీసులు గుర్తించినప్పుడు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.. ప్రత్యేకించి, కేసు పరిశీలన కోసం క్లబ్ నిర్వాహకులు విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే.. క్లబ్ నిర్వాహకులు పందాలకు సంబంధించిన వార్షిక పనులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది అంటూ ప్రచారాలు చేసి.. మరలా పేకాట కార్యకలాపాలను నడిపిన విషయంపై కోర్టు తీవ్రంగా స్పందించింది.
మంగళవారం మాంగో బే క్లబ్‌లో పోలీసులు భారీ చర్యలు తీసుకున్నారు. 285 మందిని పేకాట ఆడుతూ పట్టుబడ్డారని పోలీస్ శాఖ ప్రకటించింది. ఇందులో 34 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు.. అదనంగా 128 కార్లు, 40 కి పైగా ద్విచక్రవాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు స్థానికంగా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది.. ఎందుకంటే క్లబ్ నిర్వాహకులు హైకోర్టు అనుమతి ఉందని ఫ్లెక్సీలు పెట్టించి పందాలు నిర్వహించినట్లు కూడా ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి వెళ్లింది.. పందాల నిర్వహణకు నేరానికి సంబంధించిన చట్ట పరిమితులు వర్తిస్తాయని, ఈ క్రమంలో వారి నిర్వాహకులు కూడా బాధ్యతాయుతంగా విచారణలో సహకరించాలని, ముందుగా ఇచ్చిన ఆదేశాలు పాటించాలని.. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. మొత్తంగా హైకోర్టులో నూజివీడు మ్యాంగో బే పేకాట క్లబ్ నిర్వాహకులకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది..