Driverless Train: దేశంలో తొలిసారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైల్ పరుగులు తీయబోతోంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూర్‌లో డ్రైవర్ లెస్ ట్రైన్ కొన్ని రోజుల్లో పని ప్రారంభించనుంది. బెంగళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ లోని ఎల్లో లైన్లో 19 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు నడుస్తుందని తెలిపారు. ఆరు కోచుల రైలు జనవరి 20న చైనా నుంచి చెన్నైకి బయలుదేరింది.
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ICJ) ఆశ్రయించింది. తాజాగా గాజా యుద్ధంపై ఐసీజే తీర్పు చెప్పింది. గాజాలో నరమేధాన్ని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇజ్రాయిల్‌ని ఆదేశించింది. గాజాలో ఇజ్రాయిల్ మరణహోమం నిర్వహిస్తోందన్న దక్షిణాఫ్రికా వాదనల్లో కొన్ని ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని ఐసీజే అభిప్రాయపడింది. మానవతా సాయం, అత్యవసర సేవలను అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.
Pakistan: పాకిస్తాన్లో చలి తీవ్రతతో పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా ఆ దేశంలో చలి వాతావరణం కారణంగా న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్సులో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణించిన పిల్లల్లో చాలా మందిని న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం వెల్లడించింది.
Car Mileage: సహజంగా మనదేశంలో ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా, ముందుగా అడిగేది అది లీటర్‌కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందని, మైలేజ్ అంచనా ఆధారంగా ప్రజలు బైకుల్ని, కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనను మైలేజ్ విషయంలో మోసం చేశారని, కార్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన 2004లో జరిగింది. తాజాగా నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) సదరు కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీని, బాధితుడికి రూ. 1 లక్ష…
Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిల్ లైన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న స్కార్పియో ఓవర్టేక్ చేసే సమయంలో రెండు బైకులను, వెనక ఉన్న ఆటో రిక్షాను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైంది.
India-Maldives Row: ఇండియా, మాల్దీవుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా ప్రజలు మాల్దీవులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాల్దీవ్స్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా అనుకూలంగా వ్యవహరించడం, భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఆలయ ట్రస్టు భక్తుల కోసం హారతి, దర్శనానికి వేళల్లో మార్పులు చేసింది. కొత్త సమయాలను పంచుకుంది. రామ మందిరం వద్దనే కాకుండా పక్కనే ఉన్న హనుమాన్ గర్హి ఆలయం వద్ద కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది.
Ukraine: ఉక్రెయిన్ ప్రధాని డేనిస్ హ్మిహాల్ ప్రధాని నరేంద్రమోడీని ‘గ్లోబల్ లీడర్’ అని ప్రశంసించారు. యుద్ధంతో దెబ్బతిన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునురద్ధరించడానికి భారత్ సాయం చేయాలని కోరాడు. భారత విద్యార్థులను తమ దేశానికి పంపండం ద్వారా మునుపటిలా వాణిజ్యం చేయడం ద్వారా భారతదేశాన్ని సాయం చేయాలని అభ్యర్థించాడు.
Gyanvapi Case: వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే సంచలనంగా మారింది. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ రిపోర్టును బహిరంగపరచడం జరిగింది. ఇప్పటికే రెండు వర్గాలకు ఈ రిపోర్టు అందింది. నిన్న హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ రిపోర్టులోని అంశాలను మీడియాకు వెళ్లడిస్తూ.. అక్కడి మసీదుకు పూర్వం పెద్ద హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తుందని వెల్లడించారు.
Salesforce: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు 2022 చివరి నుంచి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వరసగా పలు విడతల్లో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా ప్రముఖ కంపెనీలు లేఆఫ్ జాబితాలో ఉన్నాయి.