Putin Praises PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. నేటి ప్రపంచంలో అంత సులభం కాని ‘స్వతంత్ర’ విదేశాంగ విధానాన్ని అనుసరించడం భారత్‌కే చెల్లిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రష్యా మీడియా నెట్వర్క్ రష్యా టుడే వెల్లడించింది. గురువారం ‘రష్యన్ స్టూడెంట్ డే’ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు.
Read Also: Pune Airport : పూణే ఎయిర్ పోర్ట్ లో 3.66 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు..
‘‘ భారత్ ప్రపంచంలోనే అత్యధిక ఆర్థికాభివృద్ధి, వృద్ధి రేటును కలిగి ఉంది. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వ లక్షణాల వల్లే ఇది సాధ్యమైంది. ఆయన నాయకత్వంలో భారత్ ఇంతటి వేగాన్ని పుంజుకుంది’’ అని విద్యార్థులతో ఇంటారాక్షన్ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రష్యా భారతదేశంపై, దాని నాయకత్వంపై ఆధారపడొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ వేదికలపై న్యూఢిల్లీ తమతో గేమ్స్ ఆడదని హామీ ఇవ్వబడింది’’ అని అన్నారు.
‘‘ భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. ఇది నేటి ప్రపంచంలో అంత సులభం కాదు. కానీ, 1.5 బిలియన్ల జనాభా ఉన్న భారతదేశానికి అలా చేసే హక్కు ఉంది. ఇది ప్రధాని మోడీ నాయకత్వంలో ఆ హక్కు సాకారం అవుతోంది. ఉమ్మడిగా ఇరు దేశాలు పనిని నిర్వహించడానికి ఇది చాలా ముఖ్యం’’ అని అన్నారు. రష్యా అధ్యక్షుడు భారతదేశ ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవను ప్రశంసించారు. భారత్‌లో ఎక్కువ పెట్టుబడిదారుల్లో రష్యా ఒకటని, అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. భారతదేశం యొక్క విభిన్న సంస్కృతి మరియు రష్యాలో భారతీయ సినిమాల ప్రజాదరణ గురించి కూడా ఆయన మాట్లాడారు.