BCCI: హిందువులపై దాడులు.. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ బౌలర్‌ను ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను తొలగించాలని చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. కొంతకాలంగా పెరుగుతున్న ప్రజా, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మొదట బీసీసీఐ వేచి చూసింది. ఇటీవలి పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సైకియా చెప్పారు. ఇది బంగ్లాదేశ్‌లో క్షీణిస్తున్న దౌత్య పరిస్థితులు, అక్కడ జరుగుతున్న పౌర అశాంతి, అలాగే భారత్‌లో చోటు చేసుకుంటున్న నిరసనలపై పరోక్ష సూచనగా భావిస్తున్నారు.
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
మరోవైపు.. డిసెంబర్‌లో జరిగిన వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను రికార్డు స్థాయిలో రూ.9.20 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా అతను నిలిచాడు. ముస్తాఫిజుర్ కేకేఆర్‌కు వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ పెద్ద ఎదురుదెబ్బగా మారాడు. రూ.9.20 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి ముస్తాఫిజుర్‌ను తీసుకోవడం నిరాశను మిగిల్చింది.. ప్రపంచ స్థాయి మైదానాల్లో మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన ఈ బౌలర్‌ను జట్టుకు పెద్ద బలంగా కేకేఆర్ భావించింది. ఓ వైపు సీజన్ దగ్గరపడుతుండటం.. మరోవైపు.. ఈ బౌలర్‌ను కోల్పోవడంతో బౌలింగ్ విభాగంలో పెద్ద లోటు ఏర్పడింది. దీంతో చివరి ఓవర్ల భారం పూర్తిగా మతీష పతిరానాపై పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!