Budget Halwa: మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో సాంప్రదాయ ‘హల్వా వేడుక’ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నార్గ్ బ్లాక్లోని కేంద్రం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కేంద్రం ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ ఉన్నారు. బడ్జెట్ ప్రక్రియ ముగింపు, ముద్రణకు ముందు ఇలా హల్వా […]
Saudi Arabia: ఇస్లామిక్ చట్టాలను కఠినంగా పాటించే సౌదీ అరేబియాలో మద్యపానంపై బ్యాన్ ఉంది. ఆ దేశంలో ఎక్కడా కూడా ఆల్కాహాలు దొరకదు, ఎవరైనా వాటితో పట్టుబడితే నేరంగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా సౌదీలో మొట్టమొదటి సారిగా లిక్కర్ షాప్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం రాజధాని రియాద్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.
Tata Motors: టాటా మోటార్స్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై మరింత ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. టాటా మోటార్స్ ఫిబ్రవరి 1 నుంచి అన్ని మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలపై ధరలు పెరగనున్నాయి.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలో రాజకీయంగా ఉద్రిక్తతతలకు కారణమవుతోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, రాహుల్ గాంధీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు.
PM Modi: అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా కొలువుదీరారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా సోమవారం రోజున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆలయ ట్రస్టు ఆహ్వానాలు అందించడంతో వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లొద్దని ప్రధాని నరేంద్రమోడీ కోరినట్లు సమాచారం.
Interfaith Relationship: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువతిని అతని సోదరుడు చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామంలో జరిగింది. యువతిని ఆమె సోదరుడు నితిన్ గ్రామంలోని చెరువులోకి తోసివేయడంతో మరణించింది. ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు.
General elections: భారతదేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) ‘ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను తీసుకువచ్చింది. భారత్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పుడు సమాచార ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ప్రపంచంలోనే తప్పుడు సమాచార ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ మొదటిస్థానంలో ఉందని నివేదిక తెలిపింది. నివేదిక జనవరి ప్రారంభంలో దాని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ మరియు గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే యొక్క 19వ…
Gyanvapi-Kashi Vishwanath Temple: జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును బహిరంగపరచాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక హార్డ్ కాపీలను ఇరు వర్గాలతో పంచుకోవాలని కోర్టు ఏఎస్ఐకి సూచించింది. డిసెంబర్ 19న ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించింది. మసీదు హిందూ ఆలయంపై నిర్మించారా..? లేదా? అని తెలుసుకునేందుకు భారత పురావస్తు శాఖను సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏఎస్ఐ ఆ ప్రాంతంలో…
Cannibalism: సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే తన వర్గంలోని జంతువులను చంపి తింటుంటాయి. అయితే, పులుల వంటి జంతువులు పులి పిల్లల్ని చంపి తినడం చాలా అరుదు. అయితే మహారాష్ట్రలోని తాడోబా-అంధేరీ అభయారణ్యంలో మాత్రం ఓ పులి మాత్రం చిన్న పులి పిల్లల్ని చంపి తింటున్నట్లు తెలిసింది. రెండు పులుల నిర్వహించిన శవపరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మరణించిన పులులను ఆరేళ్ల టీ-142, రెండేళ్ల టీ-92గా గుర్తించారు.