టాలీవుడ్‌లో యంగ్ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ఒక క్రేజీ కంటెంట్ స్టార్‌గా మారిపోయారు. మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేసినా, ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు.. గ్యారెంటీగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సహజంగా నటిస్తూ, ముఖ్యంగా తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్విస్తున్నారు. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న శ్రీవిష్ణు, రీసెంట్‌గా వచ్చిన ‘సింగిల్’ మూవీతో యూత్‌లో కూడా తన ఫాలోయింగ్‌ని గట్టిగా పెంచేసుకున్నారు. అయితే..
Also Read : Haindava : అదిరిపోయిన ‘హైందవ’ ఫస్ట్ లుక్..
ప్రస్తుతం శ్రీవిష్ణు చేతిలో ఐదు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ‘మృత్యుంజయ్’, ‘కామ్రేడ్ కళ్యాణ్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో పాటు, సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు తో మరోసారి జతకడుతున్నారు. అంతేకాకుండా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద పెద్ద బ్యానర్లలో కూడా ఆయన సినిమాలు ఓకే అయ్యాయి. ఇలా వరుసగా కొత్త కథలతో, కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ శ్రీవిష్ణు టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయారు.