Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై సూపర్ హిట్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఫైనల్‌గా లాక్ అయింది.
READ ALSO: Sri Vishnu: వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు..
తాజాగా చిత్ర యూనిట్ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. 150 సెకన్ల (2 నిమిషాల 30 సెకన్లు) రన్‌టైమ్ ఉన్న ఈ థియేట్రికల్ ట్రైలర్ ఫైనల్ లాక్ అయినట్లు మేకర్స్ తెలిపారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి డబ్బింగ్ స్టూడియోలో ట్రైలర్ కట్‌ను ఓకే చేసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ వార్తను అధికారికంగా వెల్లడించారు. ఆ ఫోటోలో చిరంజీవి ఇంటెన్స్ యాక్షన్ సీన్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ పీక్స్‌కు చేరింది. ఈ ట్రైలర్‌ను రేపు (జనవరి 4) తిరుపతిలోని ఎస్‌వీ సినీప్లెక్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఇక జనవరి 7న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Locked…Loaded…Ready to shoot 😉
2 min 30 sec 🔥🔥#ManaShankaraVaraPrasadGaru Trailer out tomorrow 💥See you all at SV CinePlex, Tirupati 🤗 pic.twitter.com/QbW0ULigGH
— Anil Ravipudi (@AnilRavipudi) January 3, 2026
READ ALSO: Moringa Leaf: మునగ ఆకులను నీటిలో మరిగించి తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా!