Car Mileage: సహజంగా మనదేశంలో ఏ వాహనాన్ని కొనుగోలు చేసినా, ముందుగా అడిగేది అది లీటర్‌కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందని, మైలేజ్ అంచనా ఆధారంగా ప్రజలు బైకుల్ని, కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనను మైలేజ్ విషయంలో మోసం చేశారని, కార్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన 2004లో జరిగింది. తాజాగా నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) సదరు కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీని, బాధితుడికి రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Read Also: Bhavatharini: డియర్ డాటర్.. ఏడిపిస్తున్న ఇళయరాజా పోస్ట్
గత వారం ఇచ్చిన తీర్పులో డాక్టర్ ఇందర్ జిత్ సింగ్ నేతృత్వంలోని ఎన్సీడీఆర్సీ బెంచ్ తీర్పును ఇచ్చింది. ‘‘సాధారణంగా కారును కోనుగోలు చేసే వ్యక్తి కారు ఇంధన సామర్థ్యాన్ని ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. కారు ఇంధన సామర్థ్యానికి సంబంధించి మేము ఈ విషయంలో 20 అక్టోబర్ 2004 నాటి ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాము మరియు ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అని భావించాము. ప్రకటన తయారీదారు, డీలర్ యొక్క అన్యాయమైన వ్యాపారానికి సమానం’’ అంటూ వ్యాఖ్యానించింది.
కేసు విషయాని వస్తే 2004లో రాజీవ్ శర్మ అనే వ్యక్తి మారుతీ సుజుకి జెన్ కారును కొనుగోలు చేశారు. లీటర్‌కి 16-18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనే ప్రకటన ఆధారంగా అతను కారుని కొనుగోలు చేశాడు. వాస్తవానికి శర్మ కారు లీటర్‌కి 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ ఇస్తుండటంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌ని ఆశ్రయించాడు. వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు మరియు బీమాతో సహా మొత్తం ₹ 4,00,000తో సహా కారు కొనుగోలు ధరను పూర్తిగా వాపసు చేయాలని అతను అభ్యర్థించాడు. జిల్లా ఫోరం అతని అభ్యర్థనను కొంతమేర అంగీకరించి అతనికి రూ. 1 లక్ష పరిహారం ఇప్పించింది. ఈ నిర్ణయంపై మారుతి సుజుకీ స్టేట్ కమిషన్‌ని ఆశ్రయించింది. అయితే, జిల్లా ఫోరం ఆదేశాలను రాష్ట్ర కమిషన్ సమర్థించింది.