DMK: జేడీయూ నేత, బీహార్ సీఎం ఇండియా కూటమి నుంచి, ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరారు. దీంతో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, డీఎంకేల నుంచి నితీష్ కుమార్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతూ.. ఇండియా కూటమి కోసం నితీష్ కుమార్ ‘‘హిందీ’’ని కూడా భరించామని ఆయన అన్నారు. ఇండియా కూటమిలో ఆయన సమస్యాత్మకంగా ఉన్నారని అన్నారు.
Read Also: ICC: శ్రీలంక క్రికెట్‌పై నిషేధం ఎత్తేసిన ఐసీసీ..
‘‘అందరూ హిందీ మాట్లాడాలని నితీష్ కుమార్ అన్నారు. మేము దాన్ని సహించాము. అప్పుడు కూడా రాజీ పడి మౌనంగా ఉన్నాము. ఇంగ్లీష్ మాట్లాడకూడదని అనేవారు.’’ అని బాలూ అన్నారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్-డీఎంకే మధ్య సమావేశం ముగిసిన తర్వాత ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వెళ్లిపోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. శ్రీపెరంబుదూర్ నుంచి ఎంపీగా ఉన్న డీఎంకే నేత బాలు మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలకు నచ్చని హిందీ భాషపై నితీష్ కుమార్ ఎప్పుడూ పట్టుబడుతుండే వాడని, ఇండియా కూటమి కోసం నితీష్ కుమార్ ఏం పనిచేయలేదని, కూటమి భాగస్వాములతో ఆయన చర్చించని ప్రణాళిక ఏం లేదని చెప్పారు. అతను ఏ ప్లాన్ తీసుకురాలేదు, కేవలం హిందీ మాట్లాడమని కోరేవాడని అన్నారు.